నిజానికి, ఈ దేశంలోని తల్లిదండ్రులు పరస్పర సహకారం, సామాజిక అభ్యాసం, వ్యక్తిగత విజయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు చదువులో రాణించాలని ఒత్తిడి చేయరు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ఇష్టపడే పనులు చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తారు.
పిల్లలను శారీరక శ్రమ, సంగీతం, ఆటలు, ఇతర విషయాలను చేయడానికి ప్రోత్సహిస్తారు. అందుకే నెదర్లాండ్స్‌లోని పిల్లలు మానసికంగా బాగుంటారు. వారు సృజనాత్మకంగా, తెలివిగా ఎదుగుతారు.