Trump Tariff: ట్రంప్ మ‌రో పిడుగు, 200 శాతం సుంకాలు.. భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌నుందంటే.?

Published : Jul 10, 2025, 04:20 PM IST

గ‌త కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న ట్రంప్ మరోసారి విరుచుకుప‌డుతున్నారు. అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి టారిఫ్‌ల పేరుతో ప్ర‌పంచ దేశాల‌ను ఉలిక్కిప‌డేలా చేసిన ట్రంప్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

PREV
15
భారత్‌-అమెరికా వాణిజ్యంపై తీవ్ర ప్ర‌భావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్‌లు భారత్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాపర్‌పై 50 శాతం, ఔషధాలపై 200 శాతం దిగుమతి పన్నులు విధించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ చర్యలు భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు.

25
కాపర్‌పై 50% టారిఫ్

ట్రంప్ ప్రకటన ప్రకారం, అమెరికా కాపర్‌పై 50 శాతం దిగుమతి పన్ను విధించబోతోంది. ఇది జూలై చివరి లేదా ఆగస్టు 1 నాటికి అమల్లోకి వస్తుంది. భారత్ 2024–25లో మొత్తం $2 బిలియన్ల కాపర్ ఎగుమతులలో $360 మిలియన్లు అమెరికాకు సరఫరా చేసింది, ఇది మొత్తం కాపర్ ఎగుమతుల్లో 17 శాతానికి సమానం కావ‌డం విశేషం.

కాపర్ అనేది ఎలక్ట్రికల్, ఎనర్జీ, మానుఫ్యాక్చరింగ్ రంగాలలో కీలకమైన ఖనిజం. అయితే అమెరికాలో కాప‌ర్‌కు డిమాండ్ త‌గ్గినా భార‌త మార్కెట్‌లో కాప‌ర్ స‌ర‌ఫ‌రాపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌దు. అయినా సరే తాత్కాలికంగా ఎగుమతులపై దుష్ప్ర‌భావం మాత్రం క‌చ్చితంగా ఉంటుంది.

35
ఔషధాలపై 200% టారిఫ్

ట్రంప్ ప్రకటనలలో అత్యంత కీలకమైంది ఔషధాలపై 200 శాతం దిగుమతి పన్ను విధించే అంశం. అమెరికా భారత ఔషధ రంగానికి అతిపెద్ద ఎగుమతి మార్కెట్. 2024-25లో భారత ఫార్మా ఎగుమతులు $9.8 బిలియన్లకు చేరగా, వాటిలో 40 శాతం అమెరికాకు సరఫరా అయ్యాయి.

వీటిలో ప్రధానంగా జనరిక్ మందులకు చెందిన ఎగుమతులే కావడం గమనార్హం. ట్రంప్ నిర్ణయం కార‌ణంగా మెడిసిన్ డిమాండ్ భారీగా పడిపోవచ్చు. భారత కంపెనీలు తక్కువ ధరల్లో మెడిసిన్లు అందిస్తూ అమెరికన్ హెల్త్‌కేర్‌ వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. ఇప్పుడు టారిఫ్‌లు పెరగడం వల్ల వాటి ధరలు పెరిగి, అమెరిక‌న్‌ మార్కెట్ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉంది.

45
బ్రిక్స్ స‌మావేశం త‌ర్వాత ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు

BRICS దేశాలపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ అమెరికన్ డాలర్‌కు సవాలు విసురుతోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ BRICSలో భాగమైనందున, ఈ హెచ్చరికల ప్రభావం భారత దిగుమతులు, ఎగుమతులపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది.

55
అమెరికా-భార‌త్ మినీ ట్రేడ్‌పై చ‌ర్చ‌లు

ఇప్పటికే భారత్-అమెరికా మినీ ట్రేడ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు 1 నాటికి ఇది ఫైనల్ అయితే, కొత్త టారిఫ్‌లు భారత్‌పై ప్రభావం చూపకుండా ఉండే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో కాపర్, ఫార్మా, ఇతర కీలక రంగాలపై ఉన్న దిగుమతి పన్నులు చర్చలకు వస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.

Read more Photos on
click me!

Recommended Stories