Noble Prize: నోబెల్ గ్రహితలకు ఎంత డబ్బు ఇస్తారు.? ఇంకా లభించే సౌకర్యాలు ఏంటి.?

Published : Oct 07, 2025, 09:24 AM IST

Noble Prize: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో నోబెల్ ప్రధానమైంది. ఈ బహుమతి దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తారు. ఈ ఏడాది కూడా నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
వైద్యశాస్త్రంలో సైంటిస్టులకు నోబెల్ బహుమతి

వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు సైంటిస్టులను వరించిన విషయం తెలిసందే. మనుషుల్లో రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసిన మేరీ ఈ.బ్రంకోవ్, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్, డాక్టర్‌ షికోమ్‌ సకాగుచీకి ఉమ్మడిగా ఈ బహుమతి లభించింది. ఇంతకీ నోబెల్ బహుమతి గ్రహీతలకు ఎంత డబ్బు అందిస్తారు.? అద‌నంగా ల‌భించే సౌక‌ర్యాలు ఏంటంటే.

25
నోబెల్ బహుమతి ఆవిష్కర్త

నోబెల్ బహుమతి స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆలోచన నుంచి ఉద్భవించింది. డైనమైట్‌ను కనుగొన్న ఆయన, మానవతకు అసాధారణ సేవ చేసిన వ్యక్తులను గౌరవించడానికి తన ఆస్తిని ప్రతి సంవత్సరం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ విధంగా నోబెల్ బహుమతికి ప్రపంచ‌వ్యాప్తంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

35
ఏ రంగాలలో బహుమతులు లభిస్తాయి?

నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం ఆరు రంగాలలో ఇస్తారు.

* భౌతిక శాస్త్రం

* రసాయన శాస్త్రం

* వైద్యం/ఫిజియాలజీ

* సాహిత్యం

* శాంతి

* ఆర్థిక శాస్త్రాలు (ఎకనామిక్స్)

విజేతలను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ప్రదానోత్సవం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్వీడన్‌లో జరుగుతుంది. శాంతి బహుమతి నార్వేలోని ఓస్లోలో అందిస్తారు.

45
విజేతకు లభించే డబ్బు, పతకం

ప్రతి నోబెల్ బహుమతి గ్రహీతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అందుతాయి. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 10.5 కోట్లు. ఒకే విభాగంలో ఒక కంటే ఎక్కువ మంది విజేతలైతే, ఈ మొత్తం సమానంగా విభ‌జిస్తారు. విజేతలు బంగారుతో తయారు చేసిన నోబెల్ పతకాన్ని పొందుతారు, పతకంపై ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రం ఉంటుంది. ప్రతి విభాగానికి ప్రత్యేక డిజైన్ ఉంటుంది. అదనంగా, విజేతలకు వారి పేరు, విజయాలు వివరించిన అందమైన డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు.

55
ప్రపంచ గుర్తింపు

డబ్బు, పతకానికి మించి, నోబెల్ బహుమతి విజేతకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ల‌భిస్తుంది. ఈ అవార్డు గ్రహీత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రఖ్యాత వ్యక్తుల నుంచి గౌరవాన్ని పొందుతారు. వారు చేసే ప్ర‌తీ ప‌నికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భిస్తుంది. రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తారు.

సౌకర్యాలు, ప్రదానోత్సవం

నోబెల్ బహుమతి గ్రహీతలకు ప్రత్యేక ప్రభుత్వ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, గుర్తింపు, గౌరవం, అవకాశాల పరంగా ఇది అత్యంత విలువైనది. ప్రదానోత్సవం స్టాక్‌హోమ్‌లో జరుగుతుంది, రాజకుటుంబం, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, ప్రముఖులు హాజరవుతారు.

Read more Photos on
click me!

Recommended Stories