Elon Musk: మ‌స్క్ స‌రికొత్త రికార్డ్‌.. రోజుకు రూ. ల‌క్ష ఖ‌ర్చు చేసినా మ‌స్క్ ఎన్నేళ్లు కూర్చొని తిన‌గ‌ల‌డో తెలుసా?

Published : Oct 03, 2025, 02:10 PM IST

Elon Musk: ఎలాన్ మ‌స్క్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడిగా నిలిచారు. మ‌స్క్‌ సంపద 500 బిలియన్ డాలర్లు దాటేసిందని ఫోర్బ్స్‌ రియల్ టైమ్‌ బిలియనీర్ ట్రాకర్ వెల్లడించింది.  

PREV
15
ఎలాన్ మస్క్ చరిత్రాత్మక రికార్డు

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ తన నికర విలువలో అత్యధిక పెరుగుదలని సాధించాడు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, స్టార్‌లింక్ కంపెనీల యజమాని ఎలాన్‌ మస్క్ మొదటి వ్యక్తిగా $500 బిలియన్‌ల నిక‌ర విలువకు చేరుకున్నాడు. దీంతో ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా మ‌స్క్ రికార్డు సృష్టించాడు.

25
రోజుకు రూ. ల‌క్ష ఖ‌ర్చు చేసినా..

సాధార‌ణంగా ఒక వ్య‌క్తి రోజుకు ల‌క్ష రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం అనేది అసాధ్యం. కానీ మ‌స్క్‌కు మాత్రం ఇది చాలా సింపుల్‌. ప్రతీ రోజూ రూ. ల‌క్ష ఖ‌ర్చు చేసినా ఏడాదికి సుమారు రూ. 3.65 కోట్లు అవుతుంది. మస్క్ ప్రస్తుత నికర సంపద సుమారు రూ. 41,000,000,000,000గా ఉంది. మస్క్ సంపదతో పోలిస్తే, ఈ ఖర్చు చాలా తక్కువ. ఈ లెక్కన మస్క్ ఏకంగా 11 లక్ష‌ల సంవ‌త్స‌రాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవ‌చ్చ‌న్న‌మాట‌.

35
సంపద పెరుగుదల వెనుక కారణాలు

ఎలోన్ మస్క్ తన సంపదపై మాత్రమే ఆధారపడడు. అతని కంపెనీలు నిరంతరం కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా..

* టెస్లా షేర్ల విలువ పెరుగుదల.

* స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ పెరుగుదల

* న్యూరాలింక్, స్టార్‌లింక్ వంటి ప్రాజెక్టులు

ఈ కారణంగా, మస్క్ సంపద వేగంగా పెరుగుతోంది, రోజూ లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా త‌ర‌గిపోని స్థాయికి చేరుకుంది.

45
ఖర్చులు, విలాసవంతమైన జీవనం

మాస్క్ జీవనశైలి కొంత వరకు విలాసవంతంగా కనిపించినప్పటికీ, ఆడంబరాన్ని ఎక్కువగా కోరుకోనని పదే పదే తెలిపారు. అతని ప్రధాన ప్రాధాన్యత కంపెనీలు, ఆవిష్కరణలు, ప్రాజెక్ట్ అభివృద్ధి. అయినప్పటికీ, అతని నికర సంపద అత్యధిక స్థాయికి చేరడం వల్ల భూమ్మీద అత్యంత ధ‌న‌వంతుడిగా మారాడు.

55
ప్రపంచ చరిత్రలో ఎలోన్ మస్క్ ప్రత్యేకత

ఎలోన్ మస్క్ సంపద, దానిని నిర్వహించే విధానం, ఆర్థిక వ్యూహాలు ప్రపంచంలో అత్యధిక నికర విలువ సాధించిన వ్యక్తిగా మస్క్‌ను నిలిపాయి. సాధారణ వ్యక్తి ఆలోచించలేని విధంగా ఖర్చు చేసినా, అతని సంపద తగ్గదు. మ‌స్క్ త‌న సంప‌ద‌ను విలాసం కాకుండా మ‌రిన్ని కంపెనీల సృష్టికే ఉప‌యోగిస్తుండ‌డం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories