Smallest country: ప్రపంచంలో అత్యంత చిన్న దేశం.. ఇక్కడ నివసించేంది ముగ్గురు మాత్రమే. ఎక్క‌డో తెలుసా.?

Published : Jul 03, 2025, 10:21 AM IST

ప్ర‌పంచంలో అత్యంత చిన్న దేశం ఏంట‌న్న ప్ర‌శ్న‌ల‌కు ఠక్కున చెప్పే స‌మాధానం వాటిక‌న్ సిటీ. అయితే దీనికంటే చిన్న దేశం మ‌రోటి ఉంద‌ని మీకు తెలుసా.? ఈ దేశ జ‌నాభా కేవ‌లం ముగ్గురు అంటే ముగ్గురే. ఇంత‌కీ ఏంటా దేశం.? ఎక్క‌డ ఉంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మోలోసియా

ప్రపంచంలో 225 దేశాలు ఉన్నప్పటికీ, కొన్ని దేశాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి మోలోసియా (Molossia). ఇది అమెరికా దేశంలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న చిన్న మైక్రో నేషన్. ప్రపంచానికి ఇది “రిపబ్లిక్ ఆఫ్ మోలోసియా”గా ప‌రిచ‌యంచ.

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఈ దేశంలో ఇప్పుడు కేవ‌లం ముగ్గురు మ‌నుషులు మాత్ర‌మే ఉన్నారు. వీరితో పాటు 3 కుక్క‌లు కూడా ఉన్నాయి. నిజానికి తొలుత ఈ దేశంలో 38 మంది జ‌నాభా ఉండ‌గా ప్ర‌స్తుతం ముగ్గురికి చేరింది.

25
మోలోసియా ఎక్కడ ఉంది?

మోలోసియా, నెవాడాలోని డేటన్ అనే చిన్న పట్టణంలో, కార్సన్ సిటీకు 30 నిమిషాల డ్రైవ్ దూరంలో ఉంది. మొత్తం భూమి స్థలం కేవలం 11.3 ఎకరాలు మాత్రమే. ఈ దేశాన్ని 1977లో స్థాపించారు. మొదట గ్రాండ్ రిపబ్లిక్ ఆఫ్ వాల్డ్‌స్టీన్ అని పిలిచేవారు. 1998లో పేరును మార్చి కింగ్‌డమ్ ఆఫ్ మోలోసియాగా ఉంచారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా కెవిన్ బా (Kevin Baugh) ఉన్నారు.

35
మోలోసియాలో ఉన్న ప్రత్యేకమైన వ్యవస్థ

ఈ చిన్న దేశానికి కూడా తనదైన ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా సొంత నౌకాదళం, డాక్స్ సర్వీస్, సొంత బ్యాంకు, ఒక చిన్న అంతరిక్ష కార్యక్రమం, రేడియో స్టేషన్, చిన్న రైలు మార్గం వంటివి అందుబాటులో ఉన్నాయి.అయితే, ఈ దేశాన్ని యునైటెడ్ నేషన్స్ లేదా ఇతర అంతర్జాతీయ దేశాలు అధికారికంగా గుర్తించలేదు. అయినా, మోలోసియా తనను దేశంగా ప్రకటించుకుంటూ కొనసాగుతోంది.

45
మోలోసియా నిబంధనలు, భాష, కరెన్సీ

మోలోసియాకు సంబంధించి కొన్ని విచిత్రమైన నిబంధనలు ఉన్నాయి. వీటి ప్ర‌కారం ఈ దేశంలోకి క్యాట్ ఫిష్, ఉల్లిపాయ‌లు తీసుకురావ‌డం నిషేధించారు. ఎవరైనా ఇవి తీసుకొస్తే జైలుశిక్ష కూడా విధిస్తారు. ఇక్కడ అధికార భాష ఇంగ్లిష్ అయినా ఎస్పెరాంటో, స్పానిష్ భాషలు కూడా మాట్లాడుతారు. ఈ దేశంలో చెలామణి అయ్యే కరెన్సీ పేరు వెలోరా (Valora).

55
మోలోసియాలో పర్యటన ఎలా ఉంటుంది?

పర్యాటకులకు మోలోసియా ఓ ఆసక్తికరమైన అనుభూతి ఇస్తుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ ప్ర‌దేశాన్ని ఎక్కువ‌గా సంద‌ర్శిస్తుంటారు. పర్యాటకులు ముందుగా బుక్ చేసుకొని అక్కడికి వెళ్లవచ్చు. ఇక్కడ రైలు మార్గం ఉన్నా, న‌డుస్తూనే దేశం మొత్తాన్ని చుట్టేయ‌వ‌చ్చు.ఇక్కడ సొంతంగా తయారు చేసిన నీరు Molossian Water అనే బ్రాండ్ పేరుతో లభిస్తుంది.

ఇప్పటివరకు మోలోసియాను కేవలం 200 మైక్రోనేషన్స్‌లో ఒకటిగా మాత్రమే గుర్తించారు. అయినా, దీని విభిన్న సంస్కృతి, చరిత్ర, నియమాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పేరుకు ఈ దేశంలో ముగ్గురే ఉన్నా ప‌ర్యాట‌కుల‌తో ఎప్పుడూ కిట‌కిట‌లాడుతుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories