Iran Israel war: వామ్మో.. ఇరాన్ వార్‌ ప్లాన్ తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే. ఇది క‌దా యుద్ధ‌తంత్రం అంటే

Published : Mar 04, 2026, 10:25 AM IST

Iran Israel war: అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా ఇరాన్ మాత్రం త‌గ్గ‌డం లేదు. రెండు దేశాల‌ను త‌న‌దైన యుద్ధ‌తంత్రంతో ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఈ క్ర‌మంలోనే ఇరాన్ కొత్త యుద్ధ దారిని అవ‌లంభిస్తోంది. 

PREV
15
అట్రిషన్‌ వార్‌.. ఇరాన్‌ కొత్త యుద్ధ దారి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఇరాన్ తన ప్రత్యర్థులైన అమెరికా, ఇజ్రాయెల్ లపై ప్రత్యక్షంగా భారీ ఆయుధాలతో దాడి చేయకుండా… ఆర్థికంగా దెబ్బ‌కొట్టేందుకు స‌రికొత్త విధానాన్ని అనుసరిస్తోంది. దీనిని సైనిక నిపుణులు “అట్రిషన్‌ వార్‌” అంటారు. అంటే తాను తక్కువ ఖర్చు పెట్టి, శత్రువు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం. ఈ విధానం దీర్ఘకాల యుద్ధాల్లో కీలకం. ఎందుకంటే ఆయుధ నిల్వలు, రక్షణ ఖర్చులు, రాజకీయ ఒత్తిళ్లు అన్నీ క‌లిపి ఒక దశలో శత్రువును వెనక్కి తగ్గేలా చేస్తాయి.

25
చౌకైన షాహెద్‌ డ్రోన్లు – ఖరీదైన క్షిపణులపై సవాల్‌

ఇరాన్‌ తయారు చేస్తున్న Shahed-136 డ్రోన్లు ప్రస్తుతం ఈ వ్యూహానికి కేంద్రబిందువుగా మారాయి. ఇవి వన్‌వే అటాక్‌ డ్రోన్లు. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. అందుకే వీటిని “సూసైడ్‌ డ్రోన్లు” అని కూడా పిలుస్తారు. ఒక్కో డ్రోన్‌ తయారీ ఖర్చు సుమారు 20 వేల డాలర్లు మాత్రమే. కానీ వీటిని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు వినియోగించే రక్షణ వ్యవస్థలు చాలా ఖరీదైనవి. ఉదాహరణకు, ఇరాన్ డోమ్‌లో ఉపయోగించే ఇంటర్‌సెప్టర్‌ మిస్సైల్‌ ధర లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అలాగే పాట్రాయిట్ మిస్సైల్ సిస్ట‌మ్‌లో ఒక్కో ఇంటర్‌సెప్టర్‌ ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే లక్షల్లో తయారైన డ్రోన్‌ను కూల్చేందుకు కోట్ల రూపాయల క్షిపణి వినియోగించాల్సి వస్తోంది. ఇదే వ్యత్యాసం పాశ్చాత్య దేశాలకు ఆర్థికంగా భారమవుతోంది.

35
భారీ నిల్వలపై ఒత్తిడి – దీర్ఘకాల వ్యూహం

అట్రిషన్‌ యుద్ధంలో ప్రధాన లక్ష్యం శత్రువు నిల్వలను ఖాళీ చేయడం. యుద్ధం ఒకటి రెండు రోజులు కాదు… నెలల తరబడి సాగితే ఖరీదైన రక్షణ క్షిపణుల నిల్వలు వేగంగా తగ్గుతాయి. ఇరాన్‌ తక్కువ ఖర్చుతో వందల సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి ప్రయోగిస్తే, ప్రత్యర్థి దేశాలు వాటిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో ఇంటర్‌సెప్టర్లు వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, ఆయుధాల సరఫరా గొలుసుపై కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. ఇదే తరహా వ్యూహాన్ని

45
గల్ఫ్‌ దేశాలపై దాడులు ఎందుకు?

ఇరాన్‌ ప్రత్యక్షంగా అమెరికా లేదా ఇజ్రాయెల్‌పై మాత్రమే కాకుండా, గల్ఫ్‌ ప్రాంతంలోని కొన్ని దేశాలపై కూడా ఒత్తిడి తెస్తోంది. ముఖ్య కారణాలు మూడు ఉన్నాయి.

అమెరికా సైనిక స్థావరాలు:

గల్ఫ్‌లో ఉన్న కొన్ని దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికాపై పరోక్ష ఒత్తిడి పెరుగుతుంది.

55
ఇజ్రాయెల్‌కు మద్దతు:

కొన్ని గల్ఫ్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకున్నాయి. ఇది ఇరాన్‌కు భద్రతా సవాల్‌గా కనిపిస్తోంది.

చమురు మార్గాల నియంత్రణ:

హోర్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు కీలకం. ఈ మార్గం వద్ద ఉద్రిక్తత సృష్టించడం ద్వారా గ్లోబల్‌ మార్కెట్లపై ప్రభావం చూపే శక్తి ఇరాన్‌కు ఉంది. ఈ కారణాలతో గల్ఫ్‌ ప్రాంతం ఇరాన్‌ వ్యూహంలో కీలకంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories