చాబహార్ పోర్ట్ ద్వారా భారత్‌కు మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.
పాకిస్తాన్‌ను బైపాస్ చేసే మార్గం:
భారత్ నుంచి ఆఫ్ఘానిస్తాన్, సెంట్రల్ ఏషియా దేశాలకు సరుకులు పంపేందుకు పాకిస్తాన్ భూభాగం మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండేది. చాబహార్ పోర్ట్ వల్ల ఆ అవసరం తగ్గింది.
ఆఫ్ఘానిస్తాన్‌తో నేరుగా వ్యాపారం:
ఆఫ్ఘానిస్తాన్‌కు గోధుమలు, ఔషధాలు, నిర్మాణ సామగ్రి వంటి సరుకులను భారత్ నేరుగా పంపగలుగుతోంది.
యూరప్‌కు వేగవంతమైన మార్గం:
ఈ పోర్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC)తో అనుసంధానమై ఉంది. దీని ద్వారా ఇరాన్–రష్యా మార్గంగా యూరప్‌కు సరుకులు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో చేరే అవకాశం ఉంది.