సునీత విలియమ్స్‌ ఒక్క రోజులో 16 సూర్యోదయాలను ఎలా చూశారు.? అంతరిక్షంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకున్నారు.?

వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ISSలోనే ఉండిపోయిన ఆమె, ఇప్పుడు NASAతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త ప్రయత్నంతో తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో అసలు సునీత విలియమ్స్‌ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు.? 8 రోజులల్లో ముగియాల్సిన పర్యటన 9 నెలలపాటు ఎందుకు వాయిదా పడుతూ వచ్చింది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

NASA astronauts Sunita Williams, Butch Wilmore, along with Nick Hague and Russian cosmonaut Aleksandr Gorbunov will return to Earth (Image Credit: X@Commercial_Crew)

కేవలం 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన 59 ఏళ్ల సునీతా విలియమ్స్‌కు 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చే అవకాశం లభించింది. అనేక సమస్యల తర్వాత వ్యోమగామి సునీతా,  బుచ్ విల్మోర్‌లను తీసుకుని స్టార్‌లింక్ అంతరిక్ష నౌక నింగికి ఎగిరి ISSకి చేరుకున్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల వారిని అక్కడే వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరినీ తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల విఫలమైనప్పటికీ, ఇప్పుడు NASAతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త కృషి ఫలిస్తోంది. వ్యోమగాములు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు.
 

ప్రతీ రోజూ 16 సూర్యోదయాలు చూసిన సునీత విలియమ్స్‌: 

సాధారణంగా మనం ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తాం. అదే పశ్న.. ఒకటే అని సమాధానం ఇస్తారా.? అయితే సునీత విలియమ్స్‌ మాత్రం ఈ 9 నెలల పాటు రోజు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూశారు. ఇదేలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. సునీత విలియమ్స్‌ వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్‌లో ఉంటూ భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన ఐఎస్‌ఎస్‌ 24 గంటల్లో సుమారు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. ప్రతి సారి భూమి చుట్టూ తిరిగేటప్పుడు, ఒక్కసారి సూర్యోదయం, ఒక్కసారి అస్తమయం కనిపిస్తుంది. ఇలా స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న వారికి 24 గంటల్లో 16 సూర్యాస్తమయాలు, 16 సూర్యోదయాలు కనిపిస్తాయి. 

ఇది కూడా చదవండి: ఫ్యాక్టరీలో పై కప్పులో కనిపించే ఈ వస్తువు ఉపయోగం ఏంటో తెలుసా.?


NASA astronauts Sunita Williams, Butch Wilmore, along with Nick Hague and Russian cosmonaut Aleksandr Gorbunov will return to Earth (Image Credit: X@Commercial_Crew)

సునీత విలియమ్స్‌ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు.?  

అమెరికా అంతరిక్ష సంస్థ NASAతో పాటు ప్రైవేట్ సంస్థ బోయింగ్ సంయుక్తంగా సిబ్బందితో కూడిన ప్రయోగాన్ని చేపట్టాయి. సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బోయింగ్ తయారు చేసిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక వీరిద్దరినీ తీసుకుని 2024 జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి జూన్ 6న ISSకి చేరుకుంది. ఇలా వెళ్లిన సునీతా, బుచ్ 8 రోజులు అక్కడ ఉండి, ఆ తర్వాత భూమికి తిరిగి వస్తారని నిర్ణయించారు. అయితే అనుకోని సమస్య కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 

ఇది కూడా చదవండి:  రూ. 5 లక్షలతో రూ. 15 లక్షలు పొందే అవకాశం.. అస్సలు రిస్క్‌ అనేదే లేదు..

Sunita Williams

8 రోజుల తర్వాత ఎందుకు తిరిగి రాలేదు?

సునీతను అంతరిక్షానికి తీసుకువెళ్లిన స్టార్‌లైనర్ నౌకలోనే ఆమె భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా దాని థ్రస్టర్‌లో సమస్య తలెత్తింది. రాకెట్ ఇంజిన్‌కు ఇంధనం సజావుగా ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడిని సృష్టించే హీలియం లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఇది మార్గమధ్యంలోనే పేలిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అలా జరిగి ఉంటే కల్పనా చావ్లాను కోల్పోయిన విషాద సంఘటన మరోసారి పునరావృతమయ్యేది ఈ ప్రమాదాన్ని నివారించడానికి సునీతను ISSలోనే ఉంచి, సిబ్బంది లేని క్యాప్సూల్‌ను భూమిపైకి పంపించారు. 

సునీతా అంతరిక్షంలో ఎలాంటి ఆహారం తీసుకున్నారో తెలుసా.? 

ISSలో ఉన్న సునీతకు 3 నెలలకోసారి ఆహారం సరఫరా చేశారు. NASA ప్రకారం, ఒక వ్యోమగామికి 1.7 కేజీల ఆహారం అవసరపడుంది. ఇందులో తృణధాన్యాలు, పాల పొడి, పిజ్జా, రొయ్యల కాక్‌టెయిల్, వేయించిన చికెన్, ట్యూనా చేపలు మొదలైనవి ఉంటాయి. వాటన్నింటినీ భూమిపైనే సిద్ధం చేసి పంపుతారు. ISSలో ఉన్న వ్యోమగాములు వాటిని వేడి చేసుకుని అయస్కాంతీయ (మాగ్నెటైజ్డ్) ట్రేలలో తింటారు. తాగడానికి అవసరమైన నీటిని వ్యోమగాముల తమ మూత్రం, చెమటను శుద్ధి చేసి తీసుకుంటారు. 

Latest Videos

click me!