నేపాల్ మాత్రమే కాదు.. ప్రపంచంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసిన‌ దేశాలేంటో తెలుసా.?

Published : Sep 11, 2025, 11:27 AM IST

నేపాల్‌లో సోష‌ల్ మీడియా నిషేధం ఎంత‌టి విధ్వంసానికి దారి తీసిందో తెలిసిందే. జెన్ జీ ఉద్య‌మంతో అక్క‌డి ప్ర‌భుత్వం నిషేధాన్ని ఎత్తివేసినా ప్ర‌భుత్వం కూలే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియా నిషేధం ఉన్న దేశాల‌పై ఓ లుక్కేయండి. 

PREV
15
చైనాలో కఠినమైన నియంత్రణలు

చైనాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, X వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల‌ను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వం తమ స్వంత యాప్‌లైన వీచాట్‌, డౌయిన్ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్షలు తప్పవు.

25
ఉత్తర కొరియా – ఇంటర్నెట్‌నే లాక్

కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా అందుబాటులో ఉండదు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. సోషల్ మీడియా వాడకం పూర్తిగా నిషేధం. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై మరణశిక్ష విధించే పరిస్థితులు కూడా ఉంటాయి.

35
ఇరాన్ – సెన్సార్‌షిప్ కఠినతరం

ఇరాన్‌లో జాతీయ భద్రత పేరిట ఫేస్‌బుక్, యూట్యూబ్, X వంటి యాప్‌లను నిషేధించారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో జైలు శిక్షలతో పాటు మరణశిక్ష కూడా ఉండవచ్చు.

45
ఆఫ్ఘనిస్తాన్ – తాలిబాన్ నియంత్రణ

తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో సోషల్ మీడియా స్వేచ్ఛ దాదాపు లేనట్టే. జంతువులు లేదా మనుషుల చిత్రాలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడం శిక్షార్హం. తాలిబాన్ నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

55
సౌదీ అరేబియా – కఠిన నిఘా

సౌదీ అరేబియాలో సోషల్ మీడియా వాడకంపై అనుమ‌తి ఉన్నా, ప్రభుత్వం ప్రతీ చర్యను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, మతపరమైన భావాలను దెబ్బతీసే పోస్టులు జైలుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధిస్తారు. 2022లో ట్విట్టర్‌లో చేసిన ఒక ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్ కారణంగా ఒకరికి మరణశిక్ష విధించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

Read more Photos on
click me!

Recommended Stories