Condoms: జనాభా నియంత్రణ అనగానే చట్టాలు, విధానాలు గుర్తుకు వస్తాయి. కానీ నిశ్శబ్దంగా కండోమ్ కీలక పాత్ర పోషిస్తోంది. దీని వ్యాపారం వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆసియా ఖండంలో కండోమ్స్ అత్యధికంగా అమ్ముడయ్యే దేశం ఏదంటే.
ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి, వనరుల కొరత వంటి సమస్యలు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కండోమ్ అత్యంత సులభమైన, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న పరిష్కారంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆసియా దేశాల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో కండోమ్ వినియోగం భారీగా పెరిగింది.
25
కండోమ్ వినియోగంలో చైనా టాప్
అంతర్జాతీయ రిపోర్ట్ ల ప్రకారం ఆసియాలో కండోమ్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో ప్రతి ఏడాది సుమారు 5.8 బిలియన్ యూనిట్లు వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సంఖ్య ఆసియాలోని ఇతర దేశాలన్నింటికంటే ఎక్కువ. భారత్ రెండో స్థానం, టర్కీ మూడో స్థానం లో ఉన్నాయి.
35
చైనాలో ఈ మార్కెట్ ఇంత పెద్దదిగా ఎందుకు మారింది?
చైనాలో జనాభా సుమారు 140 కోట్లు. వీరిలో 60 కోట్లకు పైగా లైంగికంగా చురుకుగా ఉన్నవారిగా అంచనా. ఈ స్థాయి జనాభానే కండోమ్ డిమాండ్‌ను భారీగా పెంచుతోంది. మరోవైపు చైనా ప్రభుత్వం సురక్షిత సంబంధాలు, లైంగిక వ్యాధుల నివారణపై విస్తృత ప్రచారాలు నిర్వహిస్తోంది. దీని వల్ల కండోమ్ వాడకంపై ఉన్న సామాజిక సంకోచం గణనీయంగా తగ్గింది.
2023 నాటికి చైనాలో కండోమ్ మార్కెట్ విలువ సుమారు 3.69 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైంది. 2030 నాటికి ఇది 7.24 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే వచ్చే సంవత్సరాల్లో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. సంవత్సరానికి సగటు 10 శాతం వృద్ధి నమోదు అవుతోంది. ఇందులో లాటెక్స్ కండోమ్స్ వాటా 85 శాతం కంటే ఎక్కువ.
55
భారత్ సహా ఇతర ఆసియా దేశాల పరిస్థితి
ఆసియాలో రెండో అతిపెద్ద కండోమ్ మార్కెట్ భారత్. అయితే ఇక్కడ ఇంకా సామాజిక సంకోచం పెద్ద సవాలుగానే ఉంది. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, అవగాహన కార్యక్రమాల కారణంగా వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది. టర్కీ, జపాన్, దక్షిణాసియా దేశాల పట్టణ ప్రాంతాల్లో కూడా డిమాండ్ వేగంగా పెరుగుతోంది.