Top 5 Walkable Cities : ఈ నగరాల్లో నడిస్తేనే అందం.. వాకింగ్ టూరిజం కలిగిన టాప్ 5 సిటీస్

Published : Jan 30, 2026, 12:30 PM IST

వాకింగ్ టూరిజం అనేది ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. నడవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం… అలాగే ఆయా ప్రాంతాల అందాలను ఆస్వాదించే అవకాశం. ఇలా ప్రపంచంలోనే టాప్ 5 వాకింగ్ టూరిజం స్పాట్స్ ఏవో తెలుసా?  

PREV
16
టాప్ 5 వాక్ టూరిజం స్పాట్స్

Top 5 Walkable Cities : ఇండియాలో చారిత్రక, ఆద్యాత్మిక, ప్రకృతి అందాలతో కూడిన నగరాలెన్నో ఉన్నాయి. కానీ వీటిని చూడాలంటే వాహనాల్లో ప్రయాణం తప్పనిసరి. హెవీ ట్రాఫిక్, నడిచేందుకు వీలులేని రోడ్లు కొన్నిసార్లు నరకం చూపిస్తాయి. హాయిగా భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియుడు చేయిచేయి పట్టుకుని రొమాంటిక్ గా ముచ్చట్లాడుతూ నడిచేందుకు ఏ సిటీలోనూ అవకాశం ఉండదు.

అయితే విదేశాల్లోని కొన్ని నగరాల్లో ఇలా నడుచుకుంటేనే పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఎలాంటి ఇబ్బందిలేకుండా నడిచేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. పిల్లలు, ముసలివారు కూడా నడకను ఎంజాయ్ చేస్తూ పర్యాటక ప్రాంతాలను చుట్టిరావచ్చు. ఇలాంటి టాప్ 5 సిటీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
Cordoba, Spain

కార్డోబా, స్పెయిన్ 

స్పెయిన్ లోని ప్రాచీన నగరాల్లో కార్డోబా ఒకటి. ఇక్కడ రోమన్, మూరిష్ పాలకుల చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. 8వ శతాబ్దంలో మూరిష్ పాలనలో ఇది అత్యంత ప్రసిద్ద నగరం. ఇక్కడ రోమన్ వంతెనలు, ఇరుకు వీధుల్లో తెల్లటి ఇళ్లు, అందమైన ఉద్యానవనాలు, ప్యాలస్ లను నడుచుకుంటూ చుట్టిరావచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.

36
Nagasaki, Japan

నాగసాకి, జపాన్ 

నాగసాకిలోని వాలుగా ఉండే రోడ్లు, ఇరుకైన వీధులు నడిచే ప్రయాణికులకు అనువుగా ఉంటాయి. ఇక్కడ ప్రశాంతమైన తోటలు, సాంస్కృతిక ప్రదేశాలను రవాణా అవసరం లేకుండానే చూడొచ్చు.

జపాన్ లోని ప్రాచీన నగరం ఈ నాగసాకి. ఇది స్వదేశీ, విదేశీ సంస్కృతుల సమ్మేళనం. అతి పురాతన వంతెనలు, కట్టడాలతో కూడిన నగరమిది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ప్రాంతాలు కూడా నాగసాకిలో ఉన్నాయి.

46
Hiroshima, Japan

హిరోషిమా, జపాన్ 

జపాన్ లోని మరో ప్రాచీన నగరం హిరోషిమా. ఇక్కడ పాదచారులకు అనుకూలంగా మెమోరియల్ పార్కులు, మ్యూజియంలు ఉన్నాయి. స్థానిక తినుబండారాలను ఆస్వాధించేందుకు అనేక రెస్టారెంట్స్ ఉన్నాయి. పీస్ మెమోరియల్ పార్క్‌లో నడక ఒక మంచి అనుభూతినిస్తుంది.

56
Reggio Calabria, Italy

రెగ్గియో కాలాబ్రియా, ఇటలీ

ఈరెగ్గియో కాలాబ్రియాలో ప్రశాంతమైన ప్రదేశాలు, సాంస్కృతిక ఆకర్షణలు కొద్ది నడక దూరంలోనే ఉంటాయి. సముద్ర తీర అందాలను ఆస్వాదిస్తూ మ్యూజియంలు, స్థానిక ప్రదేశాలను చూడొచ్చు.

66
Monte Carlo, Monaco

మాంటె కార్లో, మొనాకో

మాంటె కార్లో చిన్నగా ఉండటంతో మ్యూజియంల నుండి విలాసవంతమైన ప్రదేశాలకు నడిచి వెళ్లొచ్చు. ఎత్తైన వీధులు కూడా అందమైన తోటలు, దుకాణాలు, క్యాసినో స్క్వేర్‌లకు దారితీస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories