Nimisha Priya: బ్ల‌డ్ మ‌నీ అంటే ఏంటి.? ఉరిశిక్ష ప‌డ్డ నిమిషా ప్రియాను ఇది ర‌క్షిస్తుందా.? అసలేం జరిగింది.?

Published : Jul 15, 2025, 01:25 PM ISTUpdated : Jul 15, 2025, 02:06 PM IST

యెమెన్ లాంటి దేశాల్లో చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హత్య‌లాంటి నేరాల్లో చిక్కుకున్న వారికి క‌చ్చితంగా మ‌ర‌ణ శిక్ష ప‌డుతుంది. అలాంటి ఓ శిక్ష‌నే ఎదుర్కొంటోంది కేర‌ళ‌కు చెందిన నిర్మిష‌. 

PREV
16
మ‌రికొన్ని గంట‌ల్లో మ‌ర‌ణ శిక్ష

కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాను యెమెన్‌లోని కోర్టు 2018లో ఓ యెమెన్ పౌరుడిని హత్య చేసిన కేసులో దోషిగా తేల్చింది. ఇటీవల యెమెన్ అధ్యక్షుడు రషాద్ అల్-అలిమి ఈ తీర్పును ఆమోదించారు. దీంతో మ‌రికొన్ని గంట‌ల్లో ఆమెకు మరణశిక్ష అమలయ్యే అవకాశముంది. దీంతో నిమిషా గురించి ఇప్పుడు దేశ‌మంతా హాట్ టాపిక్‌గా మారింది.

26
శిక్ష నుంచి బ‌య‌ట‌పేందుకు ఉన్న ఏకైక మార్గం బ్ల‌డ్ మ‌నీ

యెమెన్‌లో అమలవుతున్న ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం, హత్యల కేసుల్లో బాధిత కుటుంబం దయ చూపితే నేరస్తుడికి శిక్ష నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. దీనిని 'దియ్యా' లేదా 'బ్లడ్ మనీ'గా పిలుస్తారు. బాధిత కుటుంబం ఆర్థిక పరిహారం తీసుకొని నేరస్తుడిని క్షమిస్తే, ఉరిశిక్ష ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంటుంది. అయితే, దియ్యా మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించదు. అది బాధిత కుటుంబమే నిర్ణ‌యిస్తుంది.

36
కుటుంబ సభ్యుల ప్రయత్నాలు

నిమిషా ప్రియ తల్లి ప్రేమకుమారి గతేడాది యెమెన్ వెళ్లి అక్కడి బాధిత కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశారు. తమ కుమార్తె ప్రాణాల కోసం దాదాపు రూ.8.6 కోట్ల పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే బాధితుడు తలాల్ అబ్దో మహ్దీ కుటుంబం ఇప్పటి వరకు దీనికి అంగీకరించలేదని తెలుస్తోంది.

46
రంగంలోకి మత పెద్దలు

భారత ముస్లిం మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. ఆయన, యెమెన్‌ మత పెద్దలు, అధికారులు, బాధిత కుటుంబాన్ని కలిసి బ్లడ్ మనీ అంగీకరించేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాది సుభాష్ చంద్రన్ తెలిపారు. "ఇప్పుడు శిక్షను అడ్డుకునే మార్గం ఇదొక్కటే" అని ఆయన స్పష్టం చేశారు.

56
భారత ప్రభుత్వ ప్రయత్నాలు

నిమిషా ప్రియ రక్షణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత-యెమెన్ దేశాల మధ్య ప్రస్తుతం మెరుగైన దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల సర్వోన్నత స్థాయిలో చర్చలు జరపడం సాధ్యపడటం లేదు. తాజాగా అటార్నీ జనరల్ ఆర్‌.వెంకటరమణి సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. "బ్లడ్ మనీని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేనందున తామేం చేయలేరు" అని ఆయన తెలిపారు.

66
వాయిదా పడ్డ ఉరిశిక్ష‌

ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో నిమిషాను ఉరి తీయాల్సి ఉండగా యమెన్ ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. కేరళ నర్సు నిమిష ప్రియకు కాస్త ఊరటిచ్చే వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె మరణశిక్ష అమలును యెమెన్‌ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే నిమిషాను కాపాడేందుకు భారత ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉరిని వాయిదా వేశారని సమాచారం. మరి వాయిదా పడ్డ ఉరిశిక్ష‌ రద్దు అవుతుందా లేదా అనేది చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories