Shubhanshu Shukla: అంత‌రిక్ష ర‌హ‌స్యం.. 2 వారాల్లో 230 సూర్యోద‌యాలు చూసిన శుభాంశు శుక్లా, ఎలాగో తెలుసా?

Published : Jul 14, 2025, 03:48 PM IST

భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. రెండు వారాల త‌ర్వాత ఆయ‌న భూమిపైకి తిరిగొచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం. 

PREV
16
మ‌రికొన్ని గంట‌ల్లో భూమిపైకి

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లిన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి తిరిగి ప‌య‌న‌మ‌వుతున్నారు. మంగ‌ళ‌వారం (జులై 15వ తేదీన‌) భూమికి తిరిగి రానున్నారు.

జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌పై డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్‌కు చేరుకున్న 41 సంవత్సరాల శుభాంశు భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఈ సంద‌ర్భంగా శుభాంశు శుక్లాకు అంత‌రిక్షంలో ఎదురైనా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

26
రెండు వారాల్లో 96 లక్షల కిలోమీటర్ల ప్రయాణం

శుభాంశు శుక్లా నేతృత్వంలోని అక్సియమ్-4 (Axiom-4) బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఇప్పటివరకు 230 సూర్యోదయాలను వీక్షించారు. అలాగే వారు సుమారు 96.5 లక్షల కిలోమీటర్లకు పైగా ప్ర‌యాణించారు. ఈ బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ ఖగోళశాస్త్రజ్ఞుడు పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోష్ ఉజ్‌నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ ఉన్నారు.

36
60కి పైగా శాస్త్రీయ పరిశోధనలు

ఈ మిషన్ లో మొత్తం 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వ‌హించారు. వీటిలో బయోమెడికల్ సైన్స్, న్యూరో సైన్స్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ సంబంధిత పరిశోధనలు ఉన్నాయి. ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణం, భూమిపై జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశముంది.

46
మానవ ఆరోగ్యాన్ని మార్చే ప్రయోగాలు

ఈ మిషన్ లో డయాబెటిస్‌ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు, అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ వంటి కీలక ప్రయోగాలు నిర్వహించారు. ఇవి భవిష్యత్తులో సాధారణ ప్రజల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే అవకాశముంది.

56
ప్రైవేట్ మిషన్ల ప్రాధాన్యత పెరుగుతోంది

అక్సియమ్ స్పేస్ సంస్థ చేపట్టిన Ax-4 మిషన్ అనేది ప్రైవేట్ స్థాయిలో నిర్వహించిన అత్యంత ప్రయోగాత్మకమైన మిషన్ గా నిలిచింది. ప్రతి డేటా పాయింట్, ప్రతీ ప్రయోగం మానవాళి భవిష్యత్తుకు బలమైన అడుగులుగా నిలుస్తోంది. భవిష్యత్‌లో క్రమంగా మనిషి తక్కువ భూమి ఆకర్షణ ప్రాంతాల్లో స్థిరపడే దిశగా ఇది ముందడుగు అని సంస్థ చెబుతోంది.

66
230 సూర్యోద‌యాలు ఎలా చూశారు.?

సాధార‌ణంగా భూమిపై రోజుకు ఒక సూర్యోద‌యం మాత్ర‌మే చూస్తాం. అలాంటిది శుక్లా రెండు వారాల్లో ఏకంగా 230 సూర్యోద‌యాలు ఎలా చూశార‌న్న సందేహం రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయితే అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ISS భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో సుమారు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో అది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది.

అంటే ఒక్క రోజులో 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ప్రతి కక్ష్య పూర్త‌మ‌య్యే సమయంలో ఒకసారి సూర్యోదయం, ఒకసారి సూర్యాస్తమయం జరుగుతాయి. ఇలా రోజుకు 16 సూర్యోద‌యాల చొప్పు 14 రోజులు, అందులోనూ కొన్ని అద‌న‌పు గంట‌లు ఉండ‌డంతో శుక్లా 14 రోజుల్లో మొత్తం 230 సూర్యోద‌యాలు చూశారు.

Read more Photos on
click me!

Recommended Stories