What is RERA
ల్యాండ్ కొనుగోలు చేసి, ఇంటిని నిర్మించాలంటే చాలా ఖర్చు, సమయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇటీవల చాలా మంది అపార్ట్‌మెంట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండిపెండెంట్ ఇంటితో పోల్చితే భద్రత ఎక్కువగా ఉండడం, ఖర్చు తక్కువ అవుతుండడంతో చాలా మంది అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రడీ టూ మూవ్ అయితే నిర్మాణంలో ఉండేవి.
rera
సాధరణంగా రడీ టూ మూవ్ అపార్ట్‌మెంట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అదే అండర్ కన్‌స్ట్రక్షన్ అపార్ట్‌మెంట్‌ల ధరలు తక్కువగా ఉంటాయి. అయితే నిర్మాణంలో ఉన్న ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే సమయంలో 'రెరా' అనుమతులు ఉన్నాయా.? లేదా అన్న విషయాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ రెరా అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
rera
'RERA అంటే ఏంటి.?
రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిదే RERA (రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ). అపార్ట్‌మెంట్‌లను నిర్మించే బిల్డర్స్ కచ్చితంగా రెరా అనుమతులు తీసుకోవాల్సిందే. సాధారణంగా అపార్ట్‌మెంట్ నిర్మాణం మొదలైన కొత్తలోనే కస్టమర్ల నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తుంటారు. అయితే బిల్డర్స్ చెప్పిన సమయానికి ఫ్లాట్‌ను అందించాల్సి ఉంటుంది.
ఇందులో ఆలస్యమైతే రెరా చట్టం ప్రకారం బిల్డర్‌పై చర్యలు తీసుకుంటారు. ఒకవేళ చెప్పిన సమయానికి మించి ఎక్కువ ఆలస్యమైతే మీరు అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని బిల్డర్ తిరిగి చెల్లిస్తారు. అంతేకాకుండా మీరు చెల్లించిన మొత్తానికి 10 శాతం చొప్పున వడ్డీని కూడా తిరిగి చెల్లించాలని రెరా చట్టం చెబుతోంది. ఒకవేళ మీరు అదే అపార్ట్‌మెంట్ కావాలనుకుంటే బిల్డర్ నుంచి వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లిస్తారు. అందుకే అండర్ కన్‌స్ట్రక్షన్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు రెరా అనుమతులు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని కచ్చితగా తెలుసుకోవాలి.