ఆత్మహత్యలకు ఎలా దారి తీస్తుంది.?
మన దగ్గర ఉన్న డబ్బులతో బెట్టింగ్ చేస్తాం. ఒకవేళ అవి పోతే, ఆపేస్తాం అంతేగా.. అనే సందేహం వస్తుండొచ్చు. అయితే ఒక్కసారి జూదంలోకి దిగితే దాని నుంచి బయటకు రావడం అంత సులభమైన విషయం కాదు. రూ. 100 కోల్పోతే రూ. 1000 సంపాదిస్తా అన్న కసి పెరుగుతుంది. దీంతో అప్పులు చేయడం మొదలు పెడతారు. ఇందుకోసం లోన్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా క్షణాల్లో అప్పులు ఇచ్చే లోన్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అయితే వీటిలో వడ్డీలు ఓ రేంజ్‌లో ఉంటాయి. తీసుకున్న అప్పు చెల్లించడంలో ఏమాత్రం విఫలమైన వడ్డీతో కలిపి తీసుకున్న అప్పు మూడు రెట్లు అవుతుంది. అప్పు చేసిన డబ్బులు కూడా బెట్టింగ్ యాప్స్‌లో పోతాయి. ఇక అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పు ఇచ్చిన బెట్టింగ యాప్ నిర్వాహకులు మీ స్నేహితులకు, బంధువులకు ఫోన్‌లు చేస్తారు. మీరు అప్పు తీసుకుని ఎగ్గొట్టారంటూ ఫొటోలను వైరల్ చేస్తుంటారు. దీంతో తీవ్రమైన ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.