Healthy Diet: స్పెషల్ డేస్ లో ఎక్కువగా లాగించేస్తున్నారా..? మరి హెల్త్ మాటేంటి..?

First Published Dec 24, 2021, 2:53 PM IST

దాదాపు పండగలు, న్యూ ఇయర్, క్రిస్మస్ వంటి ఈ వెంట్లలో.. కచ్చితంగా కేక్ లు, స్వీట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. మీరు బరువు పెరగకుండా ఉండాలి అంటే.. పంచదారతో సంబంధం ఉన్న ఏ పదార్థాన్ని ముట్టుకోకుండా ఉండటమే బెటర్.


ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. అయితే.. ఏదైనా పండగ రోజు, ఇంకేదైనా స్పెషల్ ఈ వెంట్ వస్తే మాత్రం..  ఈ డైట్ సంగతి పక్కన పెట్టేసి.. లాగించేస్తున్నారు. ఎప్పుడైనా ఒక్కరోజే  కదా.. తింటే ఏమౌతుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఈ స్పెషల్ డేస్ లో తినే ఈ హెవీ ఫుడ్.. మన ఆరోగ్యంపై చాలానే ఎఫ్ట్ చూపిస్తుందట. బరువు పెరగడానికి కూడా కారణమౌతుందట. మరి., అలా కాకుండా.. బరువు  పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు  చూద్దాం.. 

దాదాపు పండగలు, న్యూ ఇయర్, క్రిస్మస్ వంటి ఈ వెంట్లలో.. కచ్చితంగా కేక్ లు, స్వీట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. మీరు బరువు పెరగకుండా ఉండాలి అంటే.. పంచదారతో సంబంధం ఉన్న ఏ పదార్థాన్ని ముట్టుకోకుండా ఉండటమే బెటర్.

వేయించిన రుచికరమైన పదార్ధాలను నివారించండి: డోనట్స్ నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు, వేయించిన రుచికరమైన వంటకాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. రుచికరమైన సాల్టెడ్ ఫుడ్ ,  క్రంచీ ఫుడ్  చూడగానే తినాలి అనిపిస్తాయి. కానీ.. వాటిని కంట్రోల్ చేసుకోవాలట. తినకుండా ఉండాలి అని చెబుతున్నారు.   అధికంగా నూనె, ఉప్పు ఉండే ఆహారాలకు దూరంగా ఉంటే.. బరువు కంట్రోల్ చేసుకోవచ్చట.


వ్యాయామం చేయడం మర్చిపోవద్దు:  పండగల సమయంలో బిజీ షెడ్యూల్  కారణంగా వ్యాయామానికి ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు. కానీ.. కాస్తో.. కూస్తో సమయం కేటాయించడం అవసరం.  శరీరం చురుకుగా లేకుంటే... మీరు గతంలో చేసిన ఫిట్నెస్ మొత్తంలొ గంగలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి.. కాస్త సమయమైనా నడవడం, పరిగెత్తడం లాంటివి చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
 


కేలరీలను గుర్తుంచుకోండి: రుచికరమైన వంటకాలు తినేటప్పుడు, ప్రజలు తరచుగా అతిగా తింటారు. పండుగల సీజన్‌లో, డైనింగ్ టేబుల్ అద్భుతమైన ఆహారంతో నిండినప్పుడు.. నిర్లక్ష్యంగా ఉండటం అసాధారణం కాదు. అయినప్పటికీ, ఆరోగ్యానికి సంబంధించినప్పుడు, ప్రతికూల ఆరోగ్య సమస్యలను నివారించడానికి  కేలరీలు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి.

click me!