మొక్కజొన్న ఎక్కువగా తింటున్నారా అయితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి!

First Published Dec 24, 2021, 12:10 PM IST

మొక్కజొన్న (Corn) శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మొక్కజొన్నలను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మొక్కజొన్న శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. మొక్కజొన్నలను తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 
 

మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ అనే విటమిన్లు (Vitamins) పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) శరీరానికి శక్తిని అందించి వ్యాధితో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.
 

జంక్ ఫుడ్స్ (Junk Foods) కు బదులుగా మొక్కజొన్న గింజలను (Corn kernels) స్నాక్స్ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మొక్కజొన్న శరీరానికి  కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
 

ఎముకల బలానికి: మొక్కజొన్న గింజలలో ఐరన్ (Iron), కాపర్ (Copper), ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టి పడేందుకు కావలసిన పోషకాలు అందించే ఎముకలను బలంగా మారుస్తాయి.     
 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మొక్కజొన్నలో అధిక మొత్తంలో పీచు పదార్థం (Fiber) ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పీచుపదార్థం పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరచి మలబద్ధకం (Constipation) సమస్యను తగ్గిస్తుంది. 

శ్వాస సంబంధిత: మొక్కజొన్నలో ఉండే బీటా క్రిప్టాక్సన్తిన్ (Beta cryptoxanthin) ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత (Respiratory) అన్ని సమస్యలను తగ్గిస్తుంది

corn

చర్మ సంరక్షణ: మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) చర్మ సౌందర్యానికి సహాయపడతాయి. మొక్కజొన్న నూనెను (Corn oil) చర్మానికి రాస్తే చర్మంపై ఏర్పడే దురద, మంటలు వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

corn

రక్తహీనతను తగ్గిస్తుంది: మొక్కజొన్నలో పోలిక్ యాసిడ్ (Folic acid) పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత (Anemia) సమస్యలను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధిని పెంచుతుంది. కనుక మొక్కజొన్నను నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

corn

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: మొక్కజొన్న రక్తకణాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ (Cholesterol) శాతాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పక్షవాతం, బీపీ, గుండెపోటు (Heart attack) వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది.

జుట్టు సంరక్షణ: మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి (Vitamin C) జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుకు మంచి నిగారింపును అందించి జుట్టు సంరక్షణను (Hair care) సహాయపడుతుంది.

శక్తిని అందిస్తుంది: శారీరక శ్రమ కారణంగా నీరసించిన శరీరానికి కావలసిన తక్షణ శక్తిని (Energy) మొక్కజొన్న అందిస్తుంది. మొక్కజొన్న శరీరానికి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా పనిచేస్తుంది.

click me!