పుదీనా టీ: పుదీనా (Mint) ఆకులతో చేసిన టీ పిల్లల కడుపు నొప్పిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఇది కడుపులోని కండరాలు మృదువుగా చేసి తిన్న ఆహారం తేలికగా జీర్ణం (Digestion) అవ్వడానికి ఉపయోగపడే పిత్త ప్రభావాన్ని విస్తరింపచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పుదీనా టీ తాగితే ఉదర భాగం ఆరోగ్యంగా ఉంటుంది. దాంతో కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి.
మనం బరువు తగ్గాలి అంటే.. ముందుగా... జంక్ ఫుడ్స్, స్వీట్స్ కోసం కలిగే క్రేవింగ్స్ ని తగ్గించుకోవాలి. మనం ఎంత క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటామో.. అంత సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయడంలో.. ఈ పుదీనా టీ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. ప్రతిరోజూ పుదీనా టీ తాగడం వల్ల మనం సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట.