చక్కెరకు బదులుగా తేనెను ఎందుకు తినాలంటే?

Published : Jun 01, 2023, 01:05 PM IST

చక్కెర ప్రాసెస్ చేయబడుతుంది. తేనె అలా కాదు. చక్కెరను తింటే బరువు పెరగడం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.   

PREV
16
చక్కెరకు బదులుగా తేనెను ఎందుకు తినాలంటే?

చక్కెరతో చేసిన ఫుడ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి.  అందుకే చాలా మంది భోజనం చేసిన తర్వాత స్వీట్ ను ఖచ్చితంగా తింటుంటారు. అలాగే ఇంకొంత మంది తీపి పదార్థాలను రోజంతా తింటూనే ఉంటారు. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. మధుమేహంతో సహా ఎన్నో రోగాల ప్రమాదాన్ని తగ్గించడానికి చక్కెర వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చక్కెరకు బదులుగా తేనెను వాడొచ్చు. తేనె చక్కెరలా కాదు. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చక్కెరకు బదులుగా తేనెను ఎందుకు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్

ప్రతి ఆహార పదార్థంలోని తీపి పరిమాణాన్ని దాని 'గ్లైసెమిక్ ఇండెక్స్' ద్వారా సూచిస్తారు. చక్కెర కంటే తేనెలో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే తీపిని తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. మధుమేహులు ఎలాంటి భయం పెట్టుకోకుండా చక్కెరకు బదులుగా తేనెను తినొచ్చు. 

36

పోషకాలు

తేనెలో ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, వివిధ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషక లోపాలను కూడా పోగొడుతాయి. 
 

46

జీర్ణ సమస్యలు

పంచదారతో పోలిస్తే తేనెనే చాలా త్వరగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. తేనెను తింటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

ఎనర్జీ బూస్టర్

తేనె ఒక శక్తివంతమైన 'ఎనర్జీ బూస్టర్' లేదా రిఫ్రెషింగ్ వనరు. తేనె తింటే మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 
 

56

తక్కువ కేలరీలు

చక్కెరలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనితో చేసిన తీపి పదార్థాలను రోజూ తింటే బాగా బరువు పెరిగిపోతారు. అయితే తేనెలో చక్కెరలో కంటే కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా తేనెను ధైర్యంగా ఉపయోగించొచ్చు. కాబట్టి టీ, జ్యూస్ లల్లో పంచదారకు బదులుగా తేనెను కలపండి. 
 

66

చర్మం ఆరోగ్యం

తేనెను తీసుకోవడం వల్ల చర్మానికి కూడా ఎంతో మంచిది జరుగుతుంది. కానీ షుగర్ చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది చర్మంపై ముడతలను కలిగిస్తుంది. కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories