ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ ను పెంచే ఈ పానీయాలను అస్సలు తాగకండి

First Published Jun 1, 2023, 12:28 PM IST

కొన్ని పానీయాలను తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. 
 

ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 18 ఏండ్ల లోపున్న వారు కూడా స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు చిన్న వయస్సులోనే వస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే కొన్ని పానీయాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇలాంటి వాటిని తాగితే  ధమనుల్లో కొలెస్ట్రాల్ వేగంగా పెరిగి నెమ్మదిగా గుండె జబ్బులు వస్తాయి. కొలెస్ట్రాల్ ను పెంచే డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

cholesterol

ఐస్ క్రీమ్ ఆధారిత పానీయాలు

ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా ప్రతిరోజూ వీటిని తాగితే మీ గుండె రిస్క్ లో పడ్డట్టే. కానీ ఈ రోజుల్లో అనేక రకాల ఫ్రూట్ షేక్ లకు ఐస్ క్రీమ్ ను జోడిస్తున్నారు. వాటిని తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 

క్రీమ్, వెన్నతో చేసిన పానీయాలు

కుంకుమపువ్వు క్రీమ్ పాలు, రబ్రీ, లస్సీ, మజ్జిగను టేస్టీగా చేయడానికి క్రీమ్, వెన్నను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి ధమనులను ఇరుగ్గా మారుస్తాయి. 
 

cholesterol

అధిక కొవ్వు పాల ఉత్పత్తులు

కొవ్వు ఎక్కువగా ఉన్న పాలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. కానీ దీనిని తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నిజానికి కొవ్వు ఎక్కువున్న పదార్ధం ధమనుల గోడలకు అంటుకుంటుంది. ఇది మీ ధమనులను ఇరుగ్గా మారుస్తుంది. దీనివల్ల మీ గుండెకు రక్తం సరిగ్గా అందదు. దీంతో మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటికి బదులుగా తక్కువ కొవ్వువున్న పాలను వాడండి.
 

cholesterol

టీ, కాఫీ

టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసుకోవచ్చు. నిజానికి  కాఫీలో కొలెస్ట్రాల్ ఉండదు. కానీ ఇది కొలెస్ట్రాల్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. కాఫీలో డైటెర్పీన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను పెంచే కొలెస్ట్రాల్-జీర్ణ పదార్థాల ఉత్పత్తిని అణిచివేస్తాయి. కాబట్టి టీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
 

High Cholesterol

కొబ్బరి, జీడిపప్పు పానీయాలు

కొబ్బరి, జీడిపప్పును ఉన్నపానీయాలు చిక్కగా, మందంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి. అలాగే ఇవి కొవ్వు కణాలను కూడా పెంచుతాయి. ఇది కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి  ఈ పానీయాలను తాగడం మానుకోండి.

click me!