మనలో చాలా మంది టూత్ బ్రష్ విరిగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు మాత్రమే మారుస్తుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు. అవును టూత్ బ్రష్ ను నెలల తరబడి మార్చడం వల్ల మీరు లేని పోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు టూత్ బ్రష్ ను ఏయే సందర్భాల్లో మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Toothbrush
బ్రిస్టిల్స్
చాలా మంది టూత్ బ్రష్ బ్రిస్టిల్స్ వంగిపోయినా అలాగే వాడుతుంటారు. కానీ ఇలా అస్సలు వాడకూడదు. మంచి టూత్ బ్రష్ బ్రిస్టిల్స్ నిటారుగా ఉంటాయి. మీరు వాడే టూత్ బ్రష్ బ్రిస్టిల్స్ నిటారుగా కాకుండా కిందకు వంగి ఉంటే వెంటనే మీ బ్రష్ ను మార్చండి.
tooth brush
అస్వస్థతకు గురైతే..
మీరు ఈ మధ్యాకాలంలో అనారోగ్యానికి గురై మళ్లీ కోలుకున్నట్టైతే కూడా మీరు మీ టూత్ బ్రష్ ను ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే టూత్ బ్రష్ వ్యాధికారక క్రిములతో వ్యాప్తి చెందుతుంది. అందుకే మీరు మళ్లీ దాన్నే ఉపయోగిస్తే మళ్లీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
దుర్వాసన
కొంతమంది టూత్ బ్రష్ నుంచి దుర్వాసన వస్తున్నా కూడా అలాగే వాడుతుంటారు. కానీ మీ టూత్ బ్రష్ నుంచి చెడు వాసన వస్తున్నట్టైతే దానిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి టూత్ బ్రష్ ను పొరపాటున కూడా వాడకూడదు.
హాస్పటల్ నుంచి ఇంటికి
మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పటల్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తే కూడా టూత్ బ్రష్ ను ఉపయోగించకండి. ఎందుకంటే వీటివల్ల మీకు మళ్లీ వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. అలాగే గడువు తీరిన టూత్ బ్రష్ లను కూడా ఉపయోగించకూడదు.సాధారణంగా టూత్ బ్రష్ ను 2 నుంచి 3 నెలలు ఉపయోగించిన తర్వాత వాడకూడదు.