Latest Videos

గురక పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

First Published May 23, 2024, 12:23 PM IST

గాఢ నిద్రలో ఉన్నచాలా మంది పెద్ద పెద్ద సౌండ్స్ తో గురక పెట్టడం చూసే ఉంటారు. కానీ ఈ గురక వల్ల ఆ వ్యక్తి బానే నిద్రపోయినా అతని చుట్టూ ఉన్నవారు మాత్రం అస్సలు నిద్రపోరు. అసలు ఈ గురక వల్ల వచ్చే అతిపెద్ద సమస్యలేంటో తెలుసా? 

snoring

నిద్రపోయేటప్పుడు గురక పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ గురకపెడుతున్నట్టు గురక పెట్టేవారికి కూడా తెలియదు. నిజానికి చాలా మందికి గురక  సర్వ సాధారణ అలవాటుగా అనుకుంటారు. కానీ గురక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ అలవాటు  వల్ల ఎన్ని సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గురక ఎందుకు పెడతారు?

నిద్రపోయేటప్పుడు గురక పెట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నాసికా గొట్టాలు అడ్డుకోవడం వల్ల కూడా గురక వస్తుంది. ఇది గాలి లోపలికి,  బయటకు కదులుతున్నప్పుడు కంపించేలా చేస్తుంది. ఇవి నాసికా గొట్టాలలో శ్లేష్మం లేదా ధూళి పేరుకుపోవడం వల్ల సంభవిస్తాయి. అలాగే గురక ఎన్నో ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా కావొచ్చు. అలాగే ఇది ఎన్నో సమస్యలకు కూడా దారితీస్తుంది. గురక వచ్చే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నిద్రకు భంగం

గురక పెట్టే వ్యక్తికి తాను గురక పెడుతున్నట్టు కూడా తెలియదు. వీళ్లు బానే నిద్రపోతారు. కానీ అతని చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రం కంటిమీద కునుకు ఉండదు. గురక శబ్దానికి నిద్రఅసలే రాదు. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. అలాగే నిద్రలేమికి దారితీస్తుంది. 

snoring


అలసట

రాత్రంత నిద్ర లేకపోవడం వల్ల మీకు రోజంతా అలసటగా, బలహీనంగా, ఒంట్లో శక్తిలేనట్టుగా అనిపిస్తుంది. ఇది మిమ్మల్ని పని విషయంలో సోమరిగా చేస్తుంది. అలాగే మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది. మీరు ఎనర్జిటిక్ గా పనిచేయాలంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. 

snoring

గుండె జబ్బుల ప్రమాదం

మితిమీరిన గురక, స్లీప్ అప్నియాలు మీకు గుండె జబ్బులొచ్చే  ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది అధిక రక్త ప్రవాహం, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
 

Snoring Disturb

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

క్రమం తప్పకుండా గురక పెట్టడం, నిద్ర లేకపోవడం మెదడు పనితీరుకు ఆటంకం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జ్ఞాపకశక్తి, శ్రద్ధ,  నిర్ణయం తీసుకోవడంపై చెడు ప్రభావాలన్ని చూపుతాయి. 

జీవక్రియ సమస్యలు

స్లీప్ అప్నియా ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం వంటి జీవక్రియ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

click me!