నిమ్మరసం ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published May 23, 2024, 4:03 PM IST

ఎండ వేడిని తట్టుకోవడానికి నీళ్లతో పాటుగా నిమ్మరసాన్ని బాగా తాగుతుంటారు. నిమ్మరసంలోని విటమిన్ సి  మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా వేసవి తాపాన్ని కూడా తీరుస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగితే మాత్రం ప్రయోజనాలకు బదులుగా నష్టాన్ని చూస్తారు. 
 

ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ రోజూ నిమ్మరసాన్ని తాగుతుంటారు. ఎందుకంటే ఇది మనల్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. దీంతో మన శరీరం ఎన్నో వ్యాధులను తట్టుకునే శక్తిని అందిస్తుంది. ఎండాకాలంలో నిమ్మరసాన్ని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ దీన్ని మరీ ఎక్కువగా తాగితే మాత్రం మీరు ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

lemon water

ఉదర సమస్యలు

కొంతమంది ఉదయాన్నే పరిగడుపున నిమ్మరసం తాగుతుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది కొవ్వు కరగడానికి కూడా సహాయపడుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
 

నోటి ఆరోగ్యంపై ప్రభావం

నిమ్మరసాన్ని ఎక్కువగా తాగడం వల్ల నోటి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అవును నిమ్మరసాన్ని ఎక్కువగా తాగడం వల్ల పంటి జలదరింపు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇది  దంత క్షయానికి దారితీస్తుంది.

జుట్టుపై చెడు ప్రభావాలు

ఎండాకాంలో నిమ్మరసాన్ని ఎక్కువగా తాగడం వల్ల జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సీజన్ లో నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే జుట్టు పొడిబారుతుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు మీ జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

చర్మ సమస్యలు

రోజూ నిమ్మరసాన్ని లిమిట్ లో తాగితే ఎలాంటి సమస్యలూ రావు. కానీ దీన్ని ఎక్కువగా తాగితేనే లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది. అందుకే నిమ్మరసాన్ని ఎక్కువగా తాగకపోవడమే మంచిది. 

మూత్ర విసర్జన సమస్యలు

ఎండాకాలమని నిమ్మరసాన్ని రోజూ లిమిట్ కు మించి తాగితే మీరు లేని పోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిలో తరచుగా మూత్ర విసర్జన కావడం కూడా ఉంది. ఈ సీజన్ లో నిమ్మరసాన్ని ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రం వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య రాకూడదంటే నిమ్మరసాన్ని సరైన మోతాదులోనే తాగాలి. 
 

డీహైడ్రేషన్ సమస్య

ఎండాకాలంలో మోతాదుకు మించి నిమ్మరసాన్ని తాగడం వల్ల మీరు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది. నిర్జలీకరణం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 

హార్ట్ బర్న్ సమస్య

మీకు ఇప్పటికే గుండెల్లో మంట సమస్య ఉంటే మీరు నిమ్మరసాన్ని తాగకపోవడమే మంచిది. అలాగే దీన్ని ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఒకవేళ మీరు నిమ్మరసాన్ని ఎక్కువగా తాగితే మీ సమస్య మరింత పెరుగుతుంది. 

click me!