Health Tips: ఇలా చేస్తే.. ఆయిల్ ఫుడ్ తిన్నా పెద్దగా సమస్య ఉండదు!

Published : Feb 26, 2025, 02:56 PM IST

ఆహారం ఏదైనా సరే మితంగా తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్. ఇవి ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తినేవారు ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
Health Tips: ఇలా చేస్తే.. ఆయిల్ ఫుడ్ తిన్నా పెద్దగా సమస్య ఉండదు!

ఫుడ్ విషయంలో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మనం ఏం తింటున్నాం. ఎంత తింటున్నాం అనే విషయాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి. అప్పుడే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఏది పడితే అది తింటే ఇప్పుడు బాగున్నా.. వయసు పెరిగేకొద్ది సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నూనె పదార్థాలు తిన్నప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకోవచ్చట. అవెంటో తెలుసుకోండి.

25
కొలెస్ట్రాల్:

నిజానికి కొలెస్ట్రాల్ అనేది చెడ్డది కాదు. కానీ ఎక్కువైతేనే ఆరోగ్యానికి ఇబ్బంది. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గించడానికి శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎక్కువగా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తినేవారు కొన్ని మంచి అలవాట్లు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరగకుండా నివారించవచ్చు.

35
వ్యాయామం

నిపుణుల ప్రకారం నూనె పదార్థాలు తిన్న వెంటనే ఎక్కువ వ్యాయామం చేయకూడదు. కాసేపు నడిస్తే మంచిది. దీనివల్ల క్యాలరీలు కరుగుతాయి, కొవ్వులు పేరుకుపోకుండా ఉంటాయి.

45
వేడి నీరు:

నూనె పదార్థాలు తిన్న కాసేపటికి 1-2 గ్లాసుల వేడి నీళ్లు తాగండి. వేడి నీరు నూనె పదార్థాలను త్వరగా బయటకు పంపిస్తుంది. కడుపు, పేగులు, లివర్‌ను కాపాడుతుంది.

55
ఇది చేయొద్దు!

- తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు చేరుతుంది. కాబట్టి తిన్న తర్వాత 2-3 గంటల తర్వాతే పడుకోవాలి.

- నూనె పదార్థాలు తిన్న తర్వాత చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. నూనె పదార్థాలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ లాంటివి తినకూడదు. తింటే లివర్, కడుపు, పేగులు దెబ్బతింటాయి. కాబట్టి ఎక్కువ ఆహారం తిన్న తర్వాత చల్లటివి తినకండి.

Read more Photos on
click me!

Recommended Stories