Climbing Or Walking: బరువు తగ్గడం.. ఈ కాలంలో ఎక్కువమందికి అతిపెద్ద సమస్య. పెరువు పెరగడం ఒక్క సమస్యే కాదు.. ఇతర సమస్యలనూ వెంట పెట్టుకొని వచ్చే ప్రమాదం. అందుకే ఎక్కువమంది బరువు తగ్గించడంపై శ్రద్ధ పెడుుతంటారు. మరి ఎక్కువ క్యాలరీలు కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడే వ్యాయామం ఏంటో ఇక్కడ చూడవచ్చు.
బరువు తగ్గడమే కాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఉత్తమ వ్యాయామం నడక. అదేవిధంగా మెట్లు ఎక్కడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కథనంలో మెట్లు ఎక్కడం లేదా నడవడం వల్ల ఏది ఎక్కువ కేలరీలు బర్న్ చేసి బరువు తగ్గుతారో తెలుసుకుందాం.
26
మెట్లు ఎక్కడం vs నడక
కేవలం వ్యాయామాలతో బరువు తగ్గలేరు. సరైన ఆహారపు అలవాట్లు ఉండాలి. ఉదాహరణకు, రోజువారీ జీవితంలో తెల్ల చక్కెర పదార్థాలు, కాఫీ లేదా టీ తాగడం మానేస్తే శరీరంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. దీనితో పాటు నడిస్తే ఎక్కువ బరువు తగ్గవచ్చు. కానీ నడక కంటే మెట్లు ఎక్కే వ్యాయామం ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుందని మీకు తెలుసా?
36
మెట్లు ఎక్కే వ్యాయామం;
నడక కంటే త్వరగా కేలరీలు బర్న్ చేయడానికి మెట్లు ఎక్కడం సహాయపడుతుంది. మనం మెట్లు ఎక్కినప్పుడు శరీరం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనివల్ల నడవడం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాం. శక్తి ఎక్కువగా ఉపయోగించినప్పుడు జీవక్రియ పెరిగి అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. దీనివల్ల బరువు తగ్గుతారు.
46
మీకు తెలుసా?
రోజుకు కనీసం 15 నిమిషాలు మెట్లు ఎక్కితే 45 నిమిషాలు చురుకుగా నడిచిన ఫలితం ఉంటుంది. అందుకే అపార్ట్మెంట్లు, ఆఫీసు.. ఎక్కడ వీలైతే అక్కడ మెట్లు ఎక్కడం ఒక అలవాటుగా మార్చుకోండి.
56
మెట్లు ఎక్కే వ్యాయామం ఎందుకు ఉత్తమం?
నడుస్తున్నప్పుడు శరీరం సమాంతర కదలికను కలిగి ఉంటుంది. తక్కువ శక్తితో నడిస్తే సరిపోతుంది. బరువు తగ్గాలంటే చురుకైన నడక చేయాలి. అది కూడా 30 నిమిషాలు చురుకుగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. కానీ మెట్లు ఎక్కేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ శక్తి ఉపయోగించి, ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.
66
మెట్లు ఎక్కే వ్యాయామం ఎందుకు ఉత్తమం?
- మీరు మెట్లు ఎక్కి దిగితే కాళ్ళకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి వ్యాయామం చేసినట్లు ఉంటుంది.
- మీ కీళ్ళు, దిగువ శరీర కండరాలు దృఢంగా ఉండటానికి ఈ వ్యాయామం ఉత్తమ ఎంపిక.
- కార్యాలయాల్లో తరచుగా లిఫ్ట్ లకు వెళ్లకుండా మెట్లు ఎక్కి దిగవచ్చు. ఇది శరీరానికి మంచి వ్యాయామం.
- వేగంగా మెట్లు ఎక్కితే అది మంచి కార్డియోలా పనిచేసి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
- నడిచేవారు వారానికి 2 రోజులు మెట్లు ఎక్కే వ్యాయామం చేయవచ్చు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.