సరిగ్గా తినకపోతే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 9, 2024, 10:04 AM IST

చాలా మంది పనిలో పడి తినడమే మర్చిపోతుంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం పుష్కలంగా తినాలి. మంచి మంచి ఆహారాలను తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. అసలు పనిలో పడి తినకపోతే ఏమౌతుందో తెలుసా?

మనం తినే ఆహారమే మన శరీరానికి ఇంధనం. ఆహారం ద్వారే మన శరీరానికి శక్తి అందుతుంది. సరిగ్గా తింటేనే మనం ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొంతమంది పనిలో లీనమై తినడమే మర్చిపోతుంటారు. ఇంకొంతమంది అయితే ఏదో తిన్నామా? అంటే  తిన్నాము అనేలా తింటారు. కానీ సరిగ్గా తినకపోతే ఒంట్లో శక్తి తగ్గుతుంది. అలాగే లేనిపోని రోగాలు వస్తాయి. అసలు సరిగ్గా తినని వాళ్లకు వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


అలసట

పోషకాహారం మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అలాగే పనులు ఎలాంటి అలసట లేకుండా చేయగలుగుతాం. కానీ తగినంతగా తినకపోవడం వల్ల శరీరంలో శక్తి ఉండదు. అలాగే ఇది మీరు ఏ పనిచేయకపోయినా అలసటకు కారణమవుతుంది. ఇది మిమ్మల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది.
 

Latest Videos


చర్మం, జుట్టు సమస్య

పోషకాహారం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే మీరు తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి కేలరీల అవసరం తగ్గుతుంది. ఫలితంగా శరీరానికి తగినన్ని పోషకాలు అందవు. దీనివల్ల చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి.
 

క్రమరహిత రుతుస్రావం

చాలా తక్కువ మొత్తంలో తినడం వల్ల హార్మోన్ల పనితీరులో మార్పులు వస్తాయి. ఇది క్రమరహిత రుతు చక్రాలు లేదా దీర్ఘకాలిక కాలాలకు దారితీస్తుంది. పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు రాకూడదంటే మీరు పుష్కలంగా తినాలి.
 

అనారోగ్యం

దీర్ఘకాలిక తక్కువ మొత్తంలో తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల తరచుగా దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఏవైన అనారోగ్య సమస్యల వచ్చినా వెంటనే తగ్గవు. 
 

లిబిడో లేకపోవడం

తగినంత ఆహారం తీసుకోకపోతే శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీంతో హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఫలితంగా లైంగిక వాంఛ తగ్గుతుంది. శృంగారాన్ని పొడిగించే శక్తి కూడా మీకు ఉండదు. అలాగే దీర్ఘకాలికంగా తక్కువ ఆహారం తినడం వల్ల విటమిన్ల, ఖనిజ లోపాలతో సహా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే సరైన మోతాదులో ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండండి.

click me!