రుతువిరతి తర్వాత మహిళల్లో కండర ద్రవ్యరాశిని కోల్పోవచ్చు. అలాగే, వయసు పెరిగే కొద్దీ మహిళల్లో విటమిన్ లోపం ఏర్పడుతుంది. మహిళలు ముఖ్యంగా విటమిన్ డి , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పకుండా తినాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తద్వారా బొడ్డు కొవ్వు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. కండర ద్రవ్యరాశిని పెంచడం బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో ముఖ్యమైన దశ అని కూడా అధ్యయనం పేర్కొంది.