అశ్వగంధను ఉదయాన్నే తింటే ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

First Published Feb 29, 2024, 9:47 AM IST

అశ్వగంధ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటారు. చాలా మంది దీన్ని లైంగిక  ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పరిగడుపున అశ్వగంధను తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్యర్యపోతారు. 
 

Image: Freepik

ఆయుర్వేదంలో.. అశ్వగంధలో ఎన్నో  ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో రోగాలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా దీన్ని ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో  ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు దీన్ని పరిగడుపున తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image: Freepik

ఒత్తిడి నుంచి ఉపశమనం

ఒత్తిడి చాలా చిన్న సమస్యగా కనిపించినా.. ఇది ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. అయితే ఉదయాన్నే అశ్వగంధను తీసుకోవడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో ఒత్తిడి తగ్గిపోతుంది. అంతేకాదు అశ్వగంధ డిప్రెషన్ ను కూడా తగ్గిస్తుంది. 
 

ashwagandha

థైరాయిడ్ సమస్యకు..

అశ్వగంధ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అవును వీళ్లు అశ్వగంధను తీసుకోవడం వల్ల థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల థైరాయిడ్ లెవల్స్ మెయింటైన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
 

రోగనిరోధక శక్తి

అశ్వగంధలో ఉండే మూలకాలు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో మన శరీరం పోరాడటానికి ఎంతో సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. 

గుండె ఆరోగ్యం 

అశ్వగంధలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన గుండెను కాపాడుతాయి. దీన్ని తీసుకుంటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

ఆయుర్వేదంలో.. అశ్వగంధ సంతానోత్పత్తిని పెంచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ఇధి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి. అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. 

Image: Freepik

మెరుగైన నిద్ర 

అశ్వగంధ మన మానసిక ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఇది మన ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే  ఇది మనం కంటినిండా నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం 

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి అశ్వగంధ ఎంతో ప్రయోజరకరంగా ఉంటుంది. దీన్ని ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల కీళ్ల వాపు తగ్గుతుంది. అలాగే నొప్పులు కూడా కాస్త తగ్గుతాయి. 

click me!