రోజూ గుమ్మడి గింజలను ఎందుకు తీసుకోవాలి..?

First Published Feb 26, 2024, 2:11 PM IST

 కడుపుతో ఉన్నప్పుడు తినడం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. అయితే.. వీటిని తినే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. ఆ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంలోనే ఉంటుందనే విషయాన్ని చాలా మంది తెలుసుకోరు. మూడుపూటలా అన్నం, కూరలు తింటే తాము మంచి ఆహారమే తీసుకుంటున్నాం కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. అవి ఒక్కటే సరిపోదు. మనం కేవలం అన్నం , కూరలు, కూరగాయలు మాత్రమే కాకుండా.. అన్ని రకాల పప్పులు, కాయగింజలు, నట్స్ కూడా భాగం చేసుకోవాలి. అలాంటి మనం ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాల్సిన ఫుడ్స్ లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పని చేస్తాయి. మరి వీటిని రోజూ ఎలా తినాలి? ఎవరు తీసుకోవాలి? వాటి వల్ల ఉపయోగాలేంటో ఓసారి చూద్దాం..

1.గుమ్మడి గింజల్లో  జింక్ పుష్కలంగా ఉంటుది. అంతేకాదు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలు వీటిని సంతోషంగా తినవచ్చు. కడుపుతో ఉన్నప్పుడు తినడం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. అయితే.. వీటిని తినే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.
 

2. గుమ్మడి గింజల్లో మెగ్నీషం ఉంటుంది. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండదు. అందేకాదు.. కొలిస్ట్రాల్ లెవల్స్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి.. వీటిని తినడం వల్ల హార్ట్ కి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు.. డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ గా ఉంటాయి.

pumpkin seeds

3.గుమ్మడి గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల... ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల..  అనేక ఆరోగ్య సమస్యల నుంచి  కాపాడుకున్నవాళ్లం అవుతాం.

4.ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే.. అలాంటివాళ్లు కనుక ప్రతిరోజూ గుమ్మడి గింజలను తమ డైట్ లో భాగం చేసుకుంటే.. వారికి మంచి నిద్ర వస్తుంది. గుమ్మడి గింజలు మన నిద్ర క్వాలిటీని పెంచుతాయి.
 

5.గుమ్మడి గింజల్లో ప్రోటీన్; ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండి ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో.. తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే.. సులభంగా బరువు తగ్గవచ్చు.

pumpkin seeds

6.ఇక ఈ గుమ్మడి గింజలను పిల్లల డైట్ లోనూ భాగం చేయవచ్చు. అలా చేయడం వల్ల పిల్లల్లో ఎముకలు బలంగా తయారవ్వడానికి సహాయపడతాయి. 

Pumpkin seeds

7.ఇక సంతానలేమి సమస్యతో బాధపడేవారు సైతం అంటే ముఖ్యంగా పురుషులు వీటిని తమ డైట్ లో భాగం చేసుకోవాలి. అప్పుడు పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది.  వీటిని డైట్ లో భాగం చేసుకుంటే.. తొందరల్లోనే తండ్రులు అవుతారు. 

click me!