పాలు ఏ టైంలో తాగాలి?

First Published | Feb 27, 2024, 4:03 PM IST

చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా తప్పకుండా పాలను తాగాలి. పాలు మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి. మన ఎముకలను బలంగా ఉంచుతాయి. మరి పాలను  ఏ టైంలో తాగాలో తెలుసా? 
 

పాలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలు మన ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అయితే కొంతమంది పాలను ఉదయాన్నే తాగుతారు. మరికొంతమంది రాత్రిపూటే తాగుతారు. అసలు పాలను ఏ సమయంలో తాగడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

శరీర నిర్మాణం 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి శరీర నిర్మాణాన్ని బట్టి పాలను తాగాలి. కొంతమందికి ఉదయం తాగితే ప్రయోజనం పొందితే.. మరికొంతమందికి రాత్రిపూట పాలు తాగితే ప్రయోజనం పొందుతారు. 
 

Latest Videos


5 సంవత్సరాల వయస్సు నుంచి పిల్లలు 

కడుపునకు సంబంధించిన సమస్యలున్నవారు పాలు తాగే సమయాన్ని మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగితే మంచిది. 

శరీరం కోసం..

శరీరాన్ని బలంగా చేసేందుకు పాలను తాగేవారు.. పాలను ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. వీళ్లు పాలను పగటిపూట మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు పగటిపూట పాలు తాగడం వల్ల పుష్కలంగా శక్తిని పొందుతారు.
 

పిల్లలు ఎప్పుడు పాలు తాగాలి? 

చిన్న పిల్లలు ఉదయాన్నే క్రీమ్ ఎక్కువగా ఉండే పాలను తాగాలి. ఎందుకంటే ఈ పాలలో ఎక్కువ మొత్తంలో కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది మన ఎముకలను బలోపేతం చేస్తుంది.

వృద్ధులు ఎప్పుడు పాలు తాగాలి? 

వృద్ధుల శారీరక శ్రమ  చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఎప్పుడూ కూడా పగటిపూట మాత్రమే పాలు తాగాలి. వయసు మీద పడ్డవారికి ఆవు పాలు తాగడం చాలా మంచిది. ఎందుకంటే ఈ పాలు సులువుగా జీర్ణమవుతాయి. 
 

పాలలో చక్కెర 

పాలను తాగకపోతే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీనివల్ల ఎముకల బలం తగ్గుతుంది. ఎముకల సమస్యలు కూడా వస్తాయి. అయితే పాలలో ఉండే థయామిన్ మీ ఎముకలను బలంగా చేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు పాలలో పంచదార కలిపి తాగితే మంచిది.

దంతాలకు మేలు 

మీకు పంటి నొప్పి లేదా దంతాలు కదులుతుంటే పాలను ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే పాలలో ఉండే కాల్షియం దంతాలను బలంగా చేస్తుంది. 
 

click me!