రైస్ ను సరైన పద్ధతిలో కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఫైబర్ ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా ప్రభావితం అవుతుంది. కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు, ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో "శక్తి ఉత్పత్తికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. ఇలాంటి అన్నాన్ని పూర్తిగా మానేస్తే వారు బలహీనంగా మారిపోతారు. అంతేకాదు చాలా విటమిన్లు, ఖనిజాల లోపం కూడా ఏర్పడుతుంది.