జ్వరం ఇందుకే వస్తుంది.. తగ్గాలంటే ఇలా చేయండి

Published : Jun 22, 2023, 12:28 PM IST

ప్రస్తుతం జ్వరం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సీజనల్ మార్పులు, అంటువ్యాధుల వ్యాప్తి వల్ల ఈ జ్వరం ఎక్కువ మందికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.   

PREV
17
 జ్వరం ఇందుకే వస్తుంది.. తగ్గాలంటే ఇలా చేయండి

కొన్ని రోజుల నుంచి జ్వరాల కేసులు అమాంతం పెరిగాయి. జ్వరంతో పాటుగా దగ్గు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా రోగుల్లో కనిపిస్తున్నాయి. అంటు వ్యాధులు జ్వరానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు జ్వరం ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27

నిపుణుల ప్రకారం.. ఈ రోజుల్లో ఇన్ఫెక్షన్ కారణంగానే జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జ్వరం సాధారణంగా 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. అయితే మూడు రోజులు గడిచేసరికి జ్వరం నయమవుతుంది. అయితే దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. హెచ్ 3 ఎన్ 2 ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్లే ఎక్కువ మందికి జ్వరం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. మరి జ్వరం రావడానికి ఇతర కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

viral-fever

ఇన్ఫెక్షన్ 

వాతావరణంలో మార్పుల కారణంగా వివిధ రకాల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జలుబు, ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, కోవిడ్-19, ఇతర ఇన్ఫెక్షన్లు వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు జ్వరానికి దారితీస్తాయి. 

47

during-fever

ఇతర వ్యాధులు

టైఫాయిడ్, న్యుమోనియా, మెనింజైటిస్, హెపటైటిస్, టాన్సిలైటిస్, అల్సర్లు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వంటి ఎన్నో సాధారణ,  తీవ్రమైన వ్యాధుల వల్ల కూడా జ్వరం వస్తుంది. 

వ్యాక్సినేషన్

నిపుణుల ప్రకారం.. టీకాలు వేసిన తర్వాత కూడా కొన్నిసార్లు జ్వరం వస్తుంది. అయతే కొన్ని కొన్ని గంటల్లో లేదా ఒక రోజుకు తగ్గిపోతుంది. ఇది సాధారణ ప్రతిచర్య. ఇది శరీరం వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ప్రతిచర్యగా చూపించగలదు.
 

57

అత్యవసర పరిస్థితులు 

విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఇతర కాలానుగుణ మార్పులు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు కూడా జ్వరం రావడానికి కారణమవుతాయి. 

జ్వరాన్ని తగ్గించే చిట్కాలు 

హైడ్రేషన్

వేడి వల్ల శరీరం నుంచి చెమటలు వస్తూనే ఉంటాయి. ఇది డీహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది. ఇది జ్వరం వచ్చేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో నీళ్లను పుష్కలంగా తాగుతూ ఉండండి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. 

67

fever

పరిశుభ్రత

సబ్బు,  నీళ్లతో చేతులను క్రమం తప్పకుండా కడగండి. జ్వరం వచ్చిన వారు తరచూ చేతులు కడుక్కోవాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులు ఇతరకు కాస్త దూరంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారం

పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థ కోసం, బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తీసుకోండి. 

77

ఆరోగ్యకరమైన జీవనశైలి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. కంటినండా నిద్రపోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. 

ముఖాన్ని తాకడం మానుకోండి

మీరు తరచూ చేతులను కడుక్కోవాలి. అలాగే ఊరికే ముఖాన్ని తాకడం మానుకోవాలి. ముఖాన్ని తాకడం వల్ల ముక్కు, నోటి ద్వారా సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే అంతర్గత అవయవాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

నిపుణుల ప్రకారం.. జ్వరం 100 కంటే తక్కువగా ఉంటే వెంటనే యాంటీ బయాటిక్స్ ఇవ్వొద్దు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే హెల్త్కేర్ ప్రొవైడర్ ను సంప్రదించి యాంటీబయాటిక్స్ ను తీసుకోవాలి. జ్వరం తక్కువగా ఉంటే తులసి కషాయం, అల్లం, పుదీనా టీలతో తగ్గించుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories