కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఈ జ్యూస్ ను తాగండి

Published : Jun 22, 2023, 02:38 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ చాలా సులువుగా ప్రాణాలను తీసేయగలదు. అందుకే దీన్ని తగ్గించుకోవాలి.   

PREV
15
కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఈ జ్యూస్ ను తాగండి
bad cholesterol

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచి  కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఇది మనకు అవసరం కూడా. కానీ చెడు కొలెస్ట్రాల్ ఎన్నో రోగాలకు దారితీస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి రోగాలు వస్తాయి. 

25
high cholesterol

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో చెడు కొలెస్ట్రాల్ ఒకటి.  మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, డయాబెటిస్ వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

35
cholesterol

కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపు తప్పినప్పుడు మాత్రమే శరీరం గుండెపోటు, స్ట్రోక్ రూపంలో సంకేతాలను ఇస్తుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మితిమీరిన మద్యపానం వంటివి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర మాంసం, కొవ్వు, స్వీట్లు, నూనె ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. వీటిని తినడం తగ్గిస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

45

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే వాటిలో టమోటా జ్యూస్ ఒకటి. టమోటాల్లో ఉండే లైకోపీన్ లు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. టమోటాలు పోషకాలు పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్. టమోటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, థియామిన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్, ప్రోటీన్ కూడా దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

55

టమాటా జ్యూస్ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక కప్పు చిన్న టమోటాలో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా టమోటాలను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.

click me!

Recommended Stories