మీ పీరియడ్స్ బ్లడ్ నల్లగా ఉందా? కారణం ఇదే..!

Published : Aug 08, 2023, 10:49 AM IST

పీరియడ్స్ బ్లడ్ రంగు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ఈ రక్తాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం ఎలా ఉంది? ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయో తెలుసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.   

PREV
17
మీ పీరియడ్స్ బ్లడ్ నల్లగా ఉందా? కారణం ఇదే..!
Image: Getty

మీ నెలసరి రక్తం రంగు కూడా మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ రక్తం ఒక్కోసారి మారుతూ ఉంటుంది. ముదురు ఎరుపు లేదా గోధుమ, గులాబీ, బూడిద, నలుపు రంగులో ఉండే అవకాశం ఉంది. అయితే పీరియడ్స్ రక్తం నల్లగా ఉంటే కొన్ని అనారోగ్య సమస్యలు మీకు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

27

పీరియడ్  రక్తం రంగు ఎందుకు మారుతుంది?

నిపుణుల ప్రకారం.. ఒక మహిళ  పీరియడ్ రక్తం రంగు, ఆకృతి ప్రతి నెలా మారొచ్చు. మారకపోవచ్చు. హార్మోన్ల మార్పులతో పాటుగా వాళ్లు తినే ఆహారం, జీవనశైలి, వయస్సు, వాతావరణం వల్ల ఈ మార్పు సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ సంక్రమణ, గర్భం, కొన్ని అరుదైన సందర్భాల్లో గర్భాశయ క్యాన్సర్ వల్ల కూడా పీరియడ్ బ్లడ్ రంగు మారుతతుంది. మరి ఈ పీరియడ్ బ్లడ్ నల్లగా మారడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
Image: Getty

పీరియడ్స్ ప్రారంభం లేదా ముగింపు

చాలా సందర్భాల్లో పీరియడ్స్ బ్లడ్ రంగు రెడ్ నుంచి బ్లాక్ కు మారడం గర్భాశయంలో రక్త ప్రవాహం,  సమయానికి సంబంధించినదని నిపుణులు అంటున్నారు. మీ పీరియడ్ బ్లడ్ నల్లగా ఉంటే మీ పీరియడ్స్ ఇప్పుడే ప్రారంభమయ్యాయని లేదా ముగిశాయనడానికి సంకేతం.
 

47
Image: Getty

యోనిలో సమస్య

పీరియడ్ బ్లడ్ నల్లగా ఉండటం యోని లోపల ఏదో చిక్కుకున్నట్టుగా సూచిస్తుంది. మీరు నల్ల రక్తాన్ని గమనించినట్టైతే అది టాంపోన్లు లేదా యోనిలోని గర్భనిరోధక పరికరాల వల్ల కావొచ్చు. ఇది యోనికి సమస్యాత్మకంగా ఉంటుంది. అలాగే అంటువ్యాధులకు దారితీస్తుంది. 
 

57

గర్భాశయ క్యాన్సర్

నల్ల రక్తంతో పాటుగా సెక్స్ తర్వాత లేదా పీరియడ్స్ మధ్య క్రమరహిత రక్తస్రావం కావడం గర్భాశయ క్యాన్సర్ కు సంకేతం. గర్భాశయ క్యాన్సర్ వల్ల అలసట, బరువు తగ్గడం, సంభోగం సమయంలో నొప్పి, లేట్ గా పీరియడ్స్ కావడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, కటి నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. 

67

గర్భస్రావం

గర్భస్రావం సమయంలో రక్తస్రావం గోధుమ నుంచి నలుపు రంగులో వస్తుంది. ఇది గర్భం దాల్చిన మొదటి 20 వారాలలో జరగొచ్చు. ముదురు ఎరుపు రక్తాన్ని కూడా నల్లగా భావించేవారున్నారు. కొన్నిసార్లు ఇది ప్రారంభ గర్భస్రావాన్ని సూచిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 

77

menstrual cup with blood

లైంగిక సంక్రమణ అంటువ్యాధులు 

నల్లని పీరియడ్ రక్తం క్లామిడియా, గోనేరియా వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు హాస్పటల్ కు వెళ్లాలి? 

నలుపు రక్తంతో పాటుగా అసాధారణమైన యోని ఉత్సర్గ, దుర్వాసన, దురద వంటి సమస్యలు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories