ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం చిట్కాలు

Published : Aug 07, 2023, 03:48 PM IST

పిల్లలకు పాలిచ్చేటప్పుడు తల్లులకు ఎన్నో సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు బాగా అలసిపోతుంటారు. అందులోనూ కొంతమంది ట్విన్స్ కు జన్మనిస్తారు. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి.   

PREV
17
ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం చిట్కాలు

టాండమ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కవలలు కాని వేర్వేరు వయస్సుల ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలివ్వడాన్ని సూచిస్తుంది. ఇది వ్యక్తిగత ఎంపిక. కానీ ఇలా పాలిచ్చేతల్లులు కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి.  చాలా మంది తల్లులు గర్భవతి అయినప్పుడు వారి మొదటి బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే గర్భం రెండవ త్రైమాసికంలో తల్లి పాల ఉత్పత్తి సాధారణంగా తగ్గుతుంది, కొంతమంది పిల్లలు మాత్రం సహజంగానే తల్లి నుంచి పాలను తాగడం ఆపేస్తారు. అయినప్పటికీ కొంతమంది తల్లులు బిడ్డ పుట్టిన తర్వాత.. ఈ బిడ్డతో పాటుగా మొదటి బిడ్డకు కూడా పాలను ఇస్తుంటారు. తక్కువ గ్యాప్ లో పుట్టిన వారు ఇలా ఎక్కువ చేస్తుంటారు. 
 

27

పాలిచ్చే తల్లులకు  ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటిలో విపరీతమైన అలసట, తరచుగా రాత్రిళ్లు మేల్కోవడం, వక్షోజాలు నొప్పి, బంధువుల నుండి కొన్ని మాటలు వంటివి ఉంటాయి. అంతేకాక తల్లి పాలివ్వడం వల్ల  భావోద్వేగ సమస్యలు కూడా వస్తాయి. ఈ అడ్డంకులు అధిగమించడానికి కొన్ని చిట్కాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటంటే..? 
 

37

స్వీయ సంరక్షణ

ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలిచ్చే తల్లులకు స్వీయ సంరక్షణ చాలా ముఖ్యం. తల్లులు ఫీడింగ్ ను పనిగా అస్సలు భావించకూడదు. అందుకే వీరు గర్భంతో ఉన్న సమయంలో ఒక బిడ్డకు పాలివ్వొచ్చు. అయితే పెద్ద పిల్లలకు ఎప్పుడు పాలివ్వాలో ఒక షెడ్యూల్ ను చేసిపెట్టుకోండి. ఇది మీకు భారంగా అనిపించకుండా ఉంచుతుంది.

47

శారీరక శ్రమ

చురుకుగా ఉండటానికి తేలికపాటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి. ఇందుకోసం ఒకటి లేదా రెండు గంటల సమాయాన్ని కేటాయించండి. ఇది మీకు పునరుత్తేజాన్ని, మానసిక పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.
 

57

విశ్రాంతి

పిల్లలను మీరొక్కరే చూసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల మీరు తగినంత విశ్రాంతిని తీసుకోలేరు. అందుకే పిల్లలను చూసుకోవడానికి భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే మీకు విశ్రాంతిని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనొచ్చు. 

67

పోషకాహారం

తల్లులు తమ ఆరోగ్యం, శక్తి స్థాయిలను నిర్వహించడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మీరు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి కొత్త తల్లులు అదనంగా 500 కేలరీలు తీసుకోవాలి. 
 

77
Breastfeeding

హైడ్రేట్ గా ఉండండి

ఆరోగ్యకరమైన తల్లులు తమ పిల్లలకు పాలివ్వడానికి, తగినంత పాల ఉత్పత్తి అయ్యేందుకు నీటిని పుష్కలంగా తాగాలి. నీరు మీరు హైడ్రేట్ గా ఉండటానికి, మీ మానసిక స్థితి మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories