జుట్టు రాలడం, చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనే వారికి కూడా ఈ అలవాటు ప్రయోజనకరంగా ఉంటుంది. మన శరీరానికి సరిపడా నీరు అందకపోతే జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. ఖాళీ కడుపుతో నీటిని తాగడం మీ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శరీరానికి తగినంత నీరు అందకపోతే మీ జుట్టు మూలాలు పొడిగా, పెళుసుగా మారతాయి. ఇది హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.