బెల్లం టీ తో బోలెడు లాభాలు.. పొట్టను తగ్గించడం నుంచి.. ఆ సమస్యను పోగొట్టడం వరకు

Published : Aug 11, 2023, 07:15 AM IST

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. పాలు-చక్కెర టీ కంటే బెల్లం టీ మీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

PREV
17
 బెల్లం టీ తో బోలెడు లాభాలు.. పొట్టను తగ్గించడం నుంచి.. ఆ సమస్యను పోగొట్టడం వరకు

బెల్లం టీ ఏంటి అని ఆశ్యర్యపోతున్నారా? బెల్లంతో తయారుచేసిన టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది తెలుసా? పాలు, పంచదార కలిపిన టీ కి బదులుగా బెల్లం టీని తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ  రక్తహీనత సమస్యను తొలగించడమే కాకుండా కడుపులోని విసెరల్ కొవ్వును కూడా తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

27

బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ కారణంగా ఇది మీ కడుపులో కొవ్వును పేరుకుపోనివ్వదు. అలాగే మీ పొట్టను పెరగనీయదు. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ అధ్యయనం ప్రకారం.. బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక మూలకాలు ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తాయి.

37

బరువు తగ్గడానికి బెల్లం ఎలా సహాయపడుతుందంటే? 

బెల్లంలోని ఔషధ గుణాలు జీర్ణశక్తిని బలోపేతం చేస్తాయి. బెల్లంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే బెల్లాన్ని తిన్న తర్వాత లేదా బెల్లం టీ తాగిన తర్వాత బెల్లం శరీరంలో జీర్ణ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ గుణం శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది.
 

47

ఇది జీర్ణ ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తుంది? 

బెల్లానికున్న ప్రత్యేకత ఏమిటంటే ఇది మన జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీని సహాయంతో శరీరంలోని అదనపు కేలరీలను సులువుగా కరిగించొచ్చు. మంచి జీవక్రియను కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి అదనపు కేలరీలను బర్న్ చేస్తాడు. ఇది వారి బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 
 

57
Image: Getty Images

రక్తహీనత నుంచి రక్షిస్తుంది 

బెల్లం స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా శరీరాన్ని శుద్ధి చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. బెల్లంలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. అలాగే ఈ మలినాలను తొలగించడం వల్ల బరువు కూడా తగ్గుతారంటున్నారు నిపుణులు. బెల్లంలో విటమిన్-ఎ, విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక రకాల సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బెల్లం టీ తాగితే రక్తానికి కూడా మేలు జరుగుతుంది.
 

67

బెల్లం టీ ని ఎలా తయారు చేయాలి?

బెల్లం టీ తయారు చేసేటప్పుడు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ టీలో తులసి ఆకులు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు కూడా వేయొచ్చు. 

కావాల్సిన పదార్థాలు 

నీళ్లు - 2 కప్పులు
బెల్లం - 2-3 టేబుల్ స్పూన్లు
టీ ఆకు - ఒక టీస్పూన్
అల్లం - 1 అంగుళం తురుము
ఏలకులు - 2-3
తులసి ఆకులు - 4-5
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
నల్ల మిరియాల పొడి - చిటికెడు

77

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అల్లం, యాలకులు, తులసి ఆకులు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులన్నీ వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఉడికిన తర్వాత రుచికి తగ్గట్టుగా టీ ఆకులు, బెల్లం వేయాలా. ఇది మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే వేడి వేడి బెల్లం టీ రెడీ అయినట్టే.  టీ కప్పులో పోసి దానిపై చిటికెడు నల్ల మిరియాల పొడిని చల్లండి. ఇంకేముంది వేడి వేడి బెల్లం టీని తాగండి. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం మీరు  ఈ టీని ఉదయం కాకుండా మధ్యాహ్నం తిన్న అరగంట తర్వాత తాగొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories