అలాగే పాలలో ఉండే కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ కేసాన్ ప్రోటీన్ తో కలిసి ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఆ సమయంలో పాలు తాగకూడదు. పాల ఉత్పత్తులు మీ శరీరంలోని కొన్ని యాంటీబయోటిక్స్ ప్రభావితంగా పనిచేయకుండా చేస్తాయి. కాబట్టి మెడిసిన్ తీసుకునే ముందుగానీ మెడిసిన్ తీసుకునే ఒక గంట తర్వాత వరకు పాలు జోలికి వెళ్ళకండి.