చక్కెర, శుద్ధి చేసిన పిండి పదార్థాలు
రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండాలంటే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఎక్కువగా తీసుకోకూడదు. వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, చక్కెర పదార్థాలు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు మీ రక్తంలో చక్కెరను ఫాస్ట్ గా పెంచుతాయి. దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే వీటికి బదులుగా తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తీసుకోండి. ఇవి మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి.