ఆకుకూరలు
ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఆకు కూరలను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. కానీ వర్షాకాలంలో వీటిని తినకపోవడమే మంచిది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..వర్షాకాలంలోని ఉష్ణోగ్రత, తేమ బ్యాక్టీరియా, ఫంగల్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఆకుకూరలపై. ఇలాంటి వాటిని తింటే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
బచ్చలికూర, మెంతి ఆకులు, క్యాబేజి వంటి కూరగాయలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మక్రిములకు నిలయం. అందుకే వర్షాకాలంలో వీలైనంత వరకు ఈ కూరగాయలకు దూరంగా ఉండండి. వీటికి బదులుగా కాకరకాయ, గుమ్మడికాయ, బెండకాయ వంటి కూరగాయలను తినండి.