చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో పానీ పూరి ఒకటి. రోడ్డుకు పక్కన పానీ పూరి బండి కనిపిస్తే చాలు టక్కమని ఆగిపోతాము. ఆ పక్కన ఉన్న పరిసరాలు గాని ఆ బండి గానీ నీట్ గా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోకుండా ప్లేట్ల మీద ప్లేట్లు పానీ పూరి లాగించేస్తాము.
అయితే అలా తినటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అందులోనీ వర్షాకాలం, శీతాకాలం సీజన్లో వీటిని తింటే మరింత ప్రమాదం. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించే సీజన్ అది. పానీపూరి వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా ఇంకా అనేక ఇతర వ్యాధులు..
వచ్చే ప్రమాదం ఉందని అనేకమంది వైద్యులు పేర్కొన్నారు. పానీ పూరీలు తీసుకోవడం వలన విరోచనాలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డిహైడ్రేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. వీటితో పాటు అల్సర్, ప్రేగులలో మంట కూడా పానీపూరి తినటం వలన వస్తుంది.
అలాగే జీర్ణక్రియలో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. అలాగే పానీపూరి తినటం వలన టైఫాయిడ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని వైద్యాధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి వర్షాకాలంలో రోడ్డు పక్కన పానీ పూరి యే కాదు..
మరి ఏ ఇతర ఫుడ్ కూడా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో రోడ్డు పక్కన పానీపూరి బండి చుట్టుపక్కల పరిసరాలు నీటి చెమ్మలతో నిండి ఉంటాయి. ఆ నీటి చెమ్మలలో దోమలు పెరుగుతాయని విషయం మనందరికీ తెలిసిందే.
కాబట్టి తినాలనిపిస్తే చక్కగా ఇంట్లోనే చేసుకొని తినండి. దీనివలన ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండు కలిసి వస్తాయి. లేదూ.. మురికి నీటితో కలిపిన పానీ పూరియే టేస్ట్ గా ఉంటుందనుకొని బయట తిన్నారంటే హాస్పిటల్ పాలు అవ్వటం తప్పనిసరి అవుతుంది.