అసాధారణమైన కడుపునొప్పి, తరచుగా రక్తస్రావం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. తెల్లదనం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా గుడ్డులోని తెల్ల సొన లాగానో ఉంటే మీరు భయపడవలసిన పనిలేదు. కానీ ప్యాంటీలు వేసుకున్న కొద్దిసేపటికే తెల్లదనం ఎక్కువగా అయిపోయి, తడిసిపోయి దుర్వాసనగా అనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకండి.