ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే..!

First Published | Aug 19, 2023, 1:08 PM IST

రోజు రోజుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో కొన్ని మాత్రం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతాయి.

lung cancer

ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. భారత్ లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యం, పొగాకును తీసుకోవడం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల కణజాలాలలో ఏర్పడే క్యాన్సర్. గాలి ప్రవహించే కణాలలో.

అసాధారణ కణాలు ఊపిరితిత్తుల లోపల అనియంత్రితంగా పెరిగినప్పుడు వాటి పనితీరుకు అంతరాయం కలుగుతుంది. అలాగే ఇవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కొన్ని ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


స్మోకింగ్

ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గల ముఖ్యమైన కారణాల్లో స్మోకింగ్ ఒకటి. పొగాకులో ఉండే కార్సినోజెన్లు, విష రసాయనాలు వంటి హానికరమైన పదార్థాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమవుతాయి. అందుకే స్మోకింగ్ ను వీలైనంత తొందరగా మానేయాలి. 
 

వాయు కాలుష్యం

పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. ఈ వాయుకాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 
 

పాసివ్ స్మోకింగ్

పాసివ్ స్మోకింగ్ అని కూడా పిలువబడే సెకండ్ హ్యాండ్ పొగ స్మోకింగ్ చేయనివారికి సమానంగా హాని కలిగిస్తుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం చేసేవారు దాదాపు 4000 రసాయనాలు, కార్బన్ మోనాక్సైడ్‌తో సహా 150 కంటే ఎక్కువ ప్రాణాంతక టాక్సిన్స్  ను సమాజంలోకి వదులుతున్నారు. రెండు నెలల నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో 38 శాతం మంది ఇంట్లో పాసివ్ స్మోకింగ్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

వాపింగ్

ఈ-సిగరెట్లు , వాపింగ్ కు అలవాటు పడ్డవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో సహా ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలొచ్చేలా చేస్తుంది. ఈ-సిగరెట్ వాడకం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

click me!