ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారా.. వారానికి రెండు రోజులు ఇలా చేస్తే చాలు?

First Published Sep 6, 2022, 3:54 PM IST

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు.
 

ఇలా ఊబకాయంతో బాధపడే వారికి మరిన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో పూర్తిగా శరీర బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.మరి ఊబకాయ  సమస్యతో బాధపడేవారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం...
 

ఊబకాయం సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే ఈ డైట్ పాటించాలని పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఆ డైట్ ఏంటో కాదు వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండటమే. వారంలో ఐదు రోజులు మనకు ఇష్టమైన ఆహారం తిన్నప్పటికీ మిగిలిన రెండు రోజులు ఉపవాసం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఐదు రోజుల పాటు మనకు ఇష్టమైన ఆహారం తినవచ్చు అంటే మరి పరిమితం లేకుండా తినడం కాదు.
 

20 సంవత్సరాలు దాటిన వారు ప్రతిరోజు 2500 కేలరీలు తీసుకోవాలి. మనం ఏ ఆహారం తీసుకున్న ఈ కేలరీలు దాటకుండా చూసుకోవాలి. ఇక మిగిలిన రెండు రోజులలో కేవలం పావు వంతు అంటే 500 కేలరీలు మాత్రమే తీసుకోవాలి. ఇలా డైట్ ఫాలో కావడాన్ని 5:2డైట్ అంటారు మరి ఈ డైట్ ఫాలో అయ్యేవారు ఉపవాసంలో ఏం తినాలి అనే విషయానికి వస్తే...

ఈ రెండు రోజులు ఉపవాసం ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అన్ని కూరగాయలతో పాటు అన్నంకి బదులు రాగి జొన్నలు వంటి వాటిని ఉపయోగించాలి. ఇక మాంసాహారం తినేవారు కొవ్వు పూర్తిగా తొలగించినటువంటి చేపలు చికెన్ వంటివి తీసుకోవచ్చు.
 

తక్కువ చక్కెర కలిగి కాఫీ టీ వంటి వాటిని తీసుకోవచ్చు. ఇక తరుచూ నీటిని మాత్రం తాగుతూ ఉండాలి. ఇలా బరువు తగ్గాలనుకునేవారు ఈ డైట్ ఫాలో కావటం వల్ల పూర్తిగా బరువు తగ్గుతారు. అయితే మొదట్లో ఈ డైట్ కాస్త కష్టతరంగా అనిపించిన అనంతరం సులువుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి డైట్ ఫాలో కావటం వల్ల ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
 

అయితే అధిక శరీర బరువు ఉన్నవారు ఒక్కసారిగా శరీరం బరువు తగ్గటం వల్ల ఎన్నో రకాల దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా 5:2 డైట్ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా రెండు రోజులు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొని ఉపవాసం ఉండటం వల్ల మన శరీరం కీటోసిస్ స్థితికి వెళుతుంది. అంటే మన శరీరంలో ఉన్న కొవ్వు శక్తిగా మారుతుంది.

తద్వారా మన శరీరంలో పేరుకుపోయిన శక్తి కొవ్వు కరిగి శక్తిగా మారడం వల్ల మన శరీరానికి ఎనర్జీ ఉండటమే కాకుండా శరీర బరువు కూడా తగ్గుతారు. ఇక ఈ డైట్ ఫాలో కావడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. మెదడు కణాల పనితీరు మెరుగుపడటమే కాకుండా మన శరీరంలో దెబ్బతిన్న కణాలు పునరుద్ధరణ కూడా జరుగుతాయి అందుకే ఈ డైట్ ఫాలో కావడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

click me!