మధుమేహన్నీ తరిమికొట్టే రాగులు.. ఈ చిట్కాలు పాటిస్తే కొన్ని రోజుల్లోనే అద్భుత ఫలితం?

First Published Jan 19, 2022, 2:08 PM IST

అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో రాగులు (Ragulu) అతి ముఖ్యమైన పౌష్టికాహారం. దక్షిణ భారతదేశంలో రాగులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు శరీరానికి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతాయి. రాగులలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మరి ఇప్పుడు రాగులను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..
 

రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, అయోడిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రాగులు లోఫ్యాట్ (Lowfat) శాతాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా రాగులలో అసంతృప్త కొవ్వు (Unsaturated fat) పదార్థాలు ఉంటాయి. రాగులను తీసుకుంటే జీర్ణం సులభంగా అవుతుంది. శారీరకశ్రమ చేసేవారు రాగులను ఎక్కువగా తీసుకుంటారు.
 

ఎముకల ఆరోగ్యానికి మంచిది: రాగులలో కాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. రాగులను పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. రాగి మాల్ట్ ను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా (Bone health) ఉంటాయి. దీంతో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
 

బరువు తగ్గుతారు: మనం తీసుకునే ఆహారంలో రాగులను ఎక్కువగా తీసుకుంటే బరువు నియంత్రణలో (Weight control) ఉంటుంది. శరీరానికి అదనపు క్యాలరీలను అందించకుండా దూరంగా ఉంచుతుంది. రాగులలో ఉండే అధిక మొత్తంలో ఫైబర్ (Fiber) కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలనిపించదు. బరువు తగ్గాలనుకొనే వారు రాగి పిండితో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
 

మధుమేహగ్రస్తులకు మంచిది: రాగులు మధుమేహగ్రస్తులకు మంచి ఔషధంగా సహాయపడుతుంది. మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు (Sugar levels) నియంత్రణలో ఉంచడానికి రాగులు  సహాయపడతాయి. మధుమేహ వ్యాధితో (Diabetes) బాధ పడేవారు రాగులతో చేసిన ఆహార పదార్థాలను, రాగి మాల్ట్ ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 

తలనొప్పి సమస్యలను తగ్గిస్తుంది: రాగులలో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి విశ్రాంతి కలిగించడానికి సహాయపడతాయి. దీంతో ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గి దీర్ఘకాలిక మైగ్రేన్ వంటి తలనొప్పి (Headache) సమస్యలు తగ్గిపోతాయి. కనుక రాగులను తీసుకోవడం మంచిది.
 

రక్తహీనతను తగ్గిస్తుంది: రాగులు రక్తహీనతను (Anemia) తగ్గించడానికి సహాయపడతాయి. రాగులలో ఐరన్ శాతం (Iron percentage) పుష్కలంగా ఉంటుంది. కనుక రక్తహీనత సమస్యలతో బాధపడేవారు రాగి పిండితో తయారు చేసిన పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.
 

బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది: బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి రాగులను తీసుకోవడం మంచిది. రాగి పిండితో చేసిన పదార్థాలను తీసుకుంటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగడంతో పాటు బిడ్డ ఎదుగుదలకు (Child growth) కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. రాగులు మంచి పౌష్టికాహారంగా (Nutrition) సహాయపడతాయి.
 

 అంతేకాకుండా రక్తపోటును (Blood pressure) నియంత్రించడానికి, వయసును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపర్చడానికి, జీర్ణక్రియను మెరుగు పరచడానికి, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి రాగులు సహాయపడతాయి. కనుక ఇన్ని పోషకాలు కలిగిన రాగులను శరీరానికి ఏదో విధంగా అందించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు

click me!