ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం ఏదో తెలుసా?

First Published Jan 19, 2022, 12:11 PM IST

పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ జీవితంలో గర్భం దాల్చడం అనేది ఒక మధురమైన అనుభూతి (Sweet feeling) వంటిది. ఈ మధురమైన క్షణాల కోసం ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మహిళ గర్భం పొందినట్టు ప్రెగ్నెన్సీ టెస్ట్ (Pregnancy test) ద్వారా నిర్ధారించుకుంటారు. అయితే ఈ టెస్ట్ ఎన్ని రోజులకు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

మహిళ గర్భం దాల్చినప్పుడు పిండం ఏర్పడి గర్భాశయంలో (Uterus) అంటుకొని ఉంటుంది. ఇటువంటి దశను ఇంప్లాంటేషన్ (Implantation) అంటారు. మహిళల్లో హార్మోన్ల మార్పులు జరిగి పిండం పెరుగుదల జరుగుతుంది. మహిళ గర్భం దాల్చినప్పుడు రక్తంలో హెచ్ సీజీ హార్మోన్ల విడుదల జరుగుతుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి కారణంగా ఇంతకుముందు క్రమం తప్పకుండా వచ్చే నెలసరి ఆగిపోతుంది.

నెలసరి ఆగిపోయిన రెండు రోజులకే రక్తంలో హెచ్ సీజీ హార్మోన్లు విడుదలై మార్పు జరుగుతుంది. గర్భందాల్చినట్టు నిర్ధారించుకోవడానికి రక్తపరీక్ష (Blood test) చేయించుకున్నప్పుడు అందులో బీటా హెచ్ సీజీ హార్మోన్ల (Beta HCG hormones) సంఖ్య 100 కన్నా ఎక్కువగా ఉంటే గర్భం దాల్చినట్టు.

ప్రతినెలా క్రమంగా వచ్చే నెలసరి ఆగిపోయినప్పుడు ఎటువంటి రక్త పరీక్ష లేకుండా  ఇంటిలోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. నెలసరి ఆగిపోయిన ఐదు రోజుల తర్వాత బ్లడ్ లో ఉండే హార్మోన్లు (Hormones) యూరిన్ లో కూడా విడుదలవుతాయి. కనుక యూరిన్ టెస్ట్ (Urine test) తో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చెప్పుకోవచ్చు.
 

అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి తెల్లవారుజామున సరైన సమయం అని వైద్యులు చెబుతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు యూరిన్ బ్లాడర్ (Urine bladder) లో ఉండడంతో హార్మోన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి నిద్ర నుంచి లేచిన వెంటనే యూరిన్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ (Test) చేయించుకోవడం మంచిది.
 

తెల్లవారుజామున గర్భధారణ కోసం తీసుకునే యూరిన్ శాంపుల్స్ (Urine samples) ఖచ్చితమైన ఫలితాన్ని అందిస్తాయి. అయితే తర్వాత తీసుకునే శాంపుల్స్ కూడా గర్భధారణ కోసం వాడవచ్చు. కానీ తర్వాత మనం నీళ్లు (Water) ఎక్కువగా తాగితే యూరిన్ లో హార్మోన్ల శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
 

అప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ (Negative) వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక తెల్లవారుజామున యూరిన్ టెంపుల్స్ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతారు. అయితే నెలసరి ఆగిపోయిన వెంటనే చాలామంది మహిళలు స్కాన్ (Scan) చేయించుకోవాలని భావిస్తారు.
 

కానీ ఇది కరెక్ట్ కాదని వైద్యులు చెబుతారు. పీరియడ్స్ (Periods) రెగ్యులర్గా రానివారు కంగారు పడకుండా ఆలస్యంగా చెక్ చేసుకోవడం మంచిది.  యూరిన్ టెస్ట్ చేసిన వారం తరువాత వెజైనాలో స్కాన్ చేస్తే గర్భాశయంలో పిండం (Fetus) ఉందో లేదో తెలుస్తుంది.
 

ఒకవేళ కడుపు స్కాన్ (Stomach scan) చేయించుకోవాలనుకునేవారు ఆరు వారాల పాటు ఆగాల్సి ఉంటుంది. అప్పుడే గర్భందాల్చిన విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. మీకు ఈ విషయంలో ఎటువంటి సందేహాలైన (Doubts) ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

click me!