బరువుని తగ్గించడంలో ముల్లంగి పాత్ర ఎంత ముఖ్యమో తెలుసా..?

First Published Jan 18, 2022, 3:17 PM IST

ముల్లంగి (Radish) శాస్త్రీయ నామం రఫనస్ సటివస్ (Rafanus sativus). ముల్లంగి చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ముల్లంగిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగి శరీరానికి శక్తిని అందించి అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ముల్లంగితో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..  
 

ముల్లంగితో సాంబార్, చట్నీ వంటి వంటలను వండుతారు. ఇది రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో పీచు పదార్థం, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫాస్ఫరస్ జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీప్యూరిటిక్ గుణాలు (Antipyretic properties) పుష్కలంగా ఉంటాయి.

ముల్లంగిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఆరోగ్యానికి అందించడంతోపాటు చర్మ సమస్యలను (Skin problems) కూడా తగ్గించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది. ముల్లంగిని సలాడ్స్ రూపంలో కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఇలా ముల్లంగిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి (Health) మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బరువును నియంత్రిస్తుంది: ముల్లంగిలో పీచు పదార్థం (Fiber), కార్బోహైడ్రేట్లు (Carbohydrates), నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక ముల్లంగిని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి విరేచనం సాఫీగా జరుగుతుంది. ముల్లంగి తీసుకుంటే కడుపునిండిన అనుభూతి కలిగి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.

క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతుంది: ముల్లంగిలో యాంటీక్యాన్సర్ ఔషధ గుణాలు (Anticancer drug properties) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ (Cancer) ను అడ్డుకొంటుంది. ముల్లంగిని తీసుకుంటే కిడ్నీ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చు.

జాండిస్ నుండి కాపాడుతుంది: ముల్లంగిని తీసుకుంటే లివర్, కడుపు పనితీరు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముల్లంగి ఆకులు (Radish leaves), బ్లాక్ రాడిష్ (Black radish) జాండీస్ నివారణకు సహాయపడతాయి. కనుక జాండీస్ వచ్చిన సమయంలో ముల్లంగిని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

చర్మ సమస్యలను తగ్గిస్తుంది: ముల్లంగిలో ఉండే పోషకాలు చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇది చర్మానికి ఆరోగ్యాన్ని అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముల్లంగితో చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా,  క్లెన్సర్ (Cleanser) గా సహాయపడి మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

వీటితో పాటు మొలలు, మూత్ర సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే బొల్లి (Vitiligo) వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. కనుక ముల్లంగిని మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా పెరుగుతుంది. ముల్లంగి ఏదో ఒక విధంగా శరీరానికి అందించడం మంచిది.

click me!