ఇంట్లోనే వేడి వేడి చికెన్ బజ్జీలు ఎలా చెయ్యాలో తెలుసా? ఎంత టేస్టీగా ఉంటాయో!

First Published Dec 21, 2021, 4:57 PM IST

చలి కాలంలో, వర్షాకాలంలో ఏమైనా వేడివేడిగా మంచి స్నాక్స్ (Snack) తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ముందుగా గుర్తొచ్చేది బజ్జీలు. కానీ ఎప్పుడూ రొటీన్ గా చేసే బజ్జీలు తిని బోర్ కొడుతుందా.. అయితే రొటీన్ గా చేసుకునే బజ్జీలకు బదులుగా చికెన్ తో బజ్జీలను ట్రై చేయండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడానికి మీ పిల్లలు ఇష్టపడతారు. వీటి తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చికెన్ బజ్జీలను (Chicken bajjilu) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..  
 

కావలసిన పదార్థాలు: 250 గ్రాముల పల్చని స్లైసులా కోసిన చికెన్ ముక్కలు (Chicken pieces cut into thin slices), రెండు స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn flour), ఒక కప్పు శెనగపిండి (Besan), రెండు స్పూన్ ల బియ్యప్పిండి (Rice flour), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), కొంచెం పసుపు (Turmeric), ఒక స్పూన్ కారం (Chili powder) , సగం స్పూన్ గరంమసాలా (Garam masala), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
 

తయారీ విధానం: చికెన్ బజ్జీల కోసం చికెన్ ను పల్చగా స్లైసులా కట్ చేసుకోవాలి. తరువాత చికెన్ ముక్కలను బాగా నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా శుభ్రపరిచిన చికెన్ (Cleaned chicken) ముక్కలపై ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని ఫ్రిజ్ (Fridge) లో గంట సేపు పెట్టుకోవాలి.
 

ఇప్పుడు మరొక గిన్నెలో బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, శెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఉప్పు, గరం మసాలా వేసి నీళ్ళు (Water) పోస్తూ బజ్జీల పిండిలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బజ్జీల ఢీ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) పోసి వేడి చేసుకోవాలి.
 

ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ ముక్కలను తీసి కలుపుకున్న శెనగపిండి మిశ్రమంలో (Besan mixture) ముంచి కాగుతున్న ఆయిల్ లో వేసి తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చేంత వరకూ రెండువైపులా వేయించుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని బజ్జీలు గా తయారు చేసుకోవాలి.
 

ఇలా తయారుచేసుకున్న చికెన్ బజ్జీలపై కొత్తిమీర (Coriyander), ఉల్లిపాయలతో (Onion) గార్నిష్ చేసి సర్వ్  చేయండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ బజ్జీలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ చికెన్ బజ్జీలను ట్రై చేయండి.
 

ఈ బజ్జీలు తింటూ కుటుంబ సభ్యులతో కలిసి చల్లటి సాయంత్రాన్ని ఆస్వాదించండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు చికెన్ బజ్జీలను స్నాక్స్ గా పెడితే వారికి ఎంతగానో నచ్చుతుంది. కనుక అప్పుడప్పుడూ ఇలాంటి కొత్త స్నాక్స్ ను ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి.

click me!