నెయ్యితో జుట్టుకు, చర్మానికి ఎన్ని ఉపయోగలో తెలుసా?

First Published Dec 21, 2021, 4:32 PM IST

దేశి నెయ్యి (Ghee) ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి మంచి వాసనను కలిగి అనేక ఆరోగ్య లక్షణాలను (Health symptoms) కలిగి ఉంటుంది. నెయ్యి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతోపాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. నెయ్యిని ఉపయోగిస్తే అనేక చర్మ సమస్యలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దేశీ నెయ్యితో చర్మ, జుట్టు సౌందర్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

నెయ్యిలో అనేక విటమిన్లు (Vitamins), ఖనిజ పదార్థాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి పొడి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. నెయ్యి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పని సహాయపడుతుంది.
 

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు (Healthy Fatty substances) ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు జుట్టు, చర్మ సమస్యలను (Hair, Skin problems) తగ్గించడానికి సహాయపడుతాయి. అయితే ఇప్పుడు నెయ్యిని ఏ విధంగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.
 

పాదాల పగుళ్లు తగ్గిస్తుంది: పాదాల పగుళ్లు సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రం చేసుకుని తడిలేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని పాదాలకు మసాజ్ (Massage) చేసి వదులుగా ఉన్న సాక్స్ లను వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పాదాల పగుళ్ల (Foot fracture) సమస్య తగ్గి పాదాలు అందంగా మారుతాయి.
 

పెదాల పగుళ్ళను తగ్గిస్తుంది: ముఖ్యంగా చలికాలంలో పెదాల సమస్య మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. పెదాలు పొడిబారి నిర్జీవంగా మారిపోతాయి. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యిని అప్లై చేసుకుని నిద్రిస్తే మంచి ఫలితం ఉంటుంది. పొడిబారిన పెదాలకు (Dry lips) నెయ్యి తగినంత తేమను అందించి మంచి లిప్ బామ్ (Lip balm) గా పనిచేస్తుంది.
 

బాడీ క్రీమ్ గా పనిచేస్తుంది: చలి కాలంలో చల్లని గాలుల కారణంగా చర్మ కణాలు (Skin cells) దెబ్బతిని పొడిబారడం జరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మానికి (Dry skin) తగినంత తేమను అందించడానికి నెయ్యి చక్కగా సహాయపడుతుంది. స్నానం చేయడానికి ముందు కొద్దిగా నెయ్యిని తీసుకొని చర్మానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
 

జుట్టు సంరక్షణ కోసం: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనె (Coconut oil), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యిని (Ghee) తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు, దురద వంటి జుట్టు సమస్యలు తగ్గి ఆకర్షనీయమైన జుట్టు సౌందర్యం మీ సొంతం అవుతుంది.
 

జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది: కలుషిత వాతావరణం కారణంగా తలలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ల ఈ కారణంగా జుట్టు రాలే సమస్యలు అధికమవుతున్నాయి. అయితే ఇలాంటప్పుడు గోరువెచ్చని నెయ్యితో తలకు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది తల భాగంలోని రక్తప్రసరణను (Blood circulation) మెరుగుపరిచి జుట్టు రాలే సమస్యలను (Hair fall problem) తగ్గిస్తుంది.

click me!