మనం రోజూ తీసుకునే ఆహారపు డైట్ లో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఖర్జూరాలను (Dates) రోజూ తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి అని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్లు, విటమిన్లు శరీర ఆరోగ్యానికి సహాయపడుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. రోజూ ఎండు ఖర్జూరాలను లేదా పచ్చి ఖర్జూరాలను తిన్న అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎండు ఖర్జూరాల నేరుగా తినడం కంటే నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
18
ఎండు ఖర్జూరాల్లో ఐరన్ (Iron) కంటెంట్, ఫ్లోరైన్ (Fluorine) సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఖర్జూరాలను రోజూ డైట్ లో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఎండు ఖర్జూరల ను నేరుగా తినడం కంటే నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తిని ఆ నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఖర్జూరాలు తింటే కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
28
జీర్ణశక్తిని పెంచుతుంది: నీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలు తింటే జీర్ణశక్తి (Digestion) మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. పేగుల్లో పేరుకుపోయిన మనం తేలికపడి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్దకం (Constipation) సమస్యలు కూడా తగ్గుతాయి.
38
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: ఎండు ఖర్జూరాలలో కొలెస్ట్రాల్ (Cholesterol) ఉండదు. ఇందులో విటమిన్లు, మినరల్స్ (Minerals) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
48
శరీరానికి శక్తిని అందిస్తుంది: ఎండు ఖర్జూరాలు ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శారీరక శ్రమ కారణంగా అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తిని (Energy) అందిస్తాయి. ఎండు ఖర్జూరాలు శరీరానికి మంచి ఎనర్జీ ప్రోటీన్ (Energy protein) గా సహాయపడుతుంది.
58
ఎముకలు దృఢంగా మారుతాయి: ఖర్జూరాలలో సెలీనియం (Selenium), మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం (Calcium) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులను తగ్గిస్తుంది.
68
రక్తహీనతను తగ్గిస్తుంది: ఖర్జూరాలలో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో (Anemia) బాధపడే వారు ఖర్జూరాలను తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. ఖర్జూరాలు బ్లడ్ ప్యూరిఫై చేయడంలో కూడా చక్కగా సహాయపడతాయి. అనేమియా వంటి సమస్యలను తగ్గిస్తుంది.
78
చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది: ఖర్జూరాల్లో ఉండే విటమిన్ సి, డి (Vitamin C, D) లు చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మ సమస్యలను (Skin problems) తగ్గించి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. చర్మాన్ని కాంతి వంతంగా ఉంచుతాయి.
88
వీటితో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటు (Blood pressure), గుండె సమస్యలు (Heart problems) తగ్గిస్తుంది. కనుక ఈ రోజూ నీటిలో రాత్రంతా నానబెట్టిన ఖర్జూరాలను ఉదయం పరగడుపున తిని ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.